ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

హైదరాబాద్, డిసెంబర్ 10, అద్దం న్యూస్ : అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ముషీరాబాద్‌లో బుధవారం ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బిపి, రాండమ్ షుగర్, జనరల్ ఫిజీషియన్, దంత, ఆప్తమాలజి ( కంటి చెకప్ ), డెర్మటాలజి, కాస్మోటాలజీ ( చర్మం, జుట్టు ), ఆడియోమెట్రి ( వినికిడి పరీక్ష ), కాన్సర్ స్క్రీనింగ్ తదితర 20 రకాల పరీక్షలను ఉచితంగా చేసి వైద్యం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్, సీతాఫల్మండి కార్పొరేటర్ శ్యామల హేమ, బిజెపి నాయకుడు చీకోటి ప్రవీణ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రతి రక్తం బొట్టు మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు చేయడం అభినందనీయమన్నారు. మానవ హక్కులను పరిరక్షించడంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు కటకం శ్రీనివాస్, జాతీయ ప్రధాన కార్యదర్శి కల్వ వీరేందర్ గుప్త, కోశాధికారి సరఫ్ రాజ్‌నేశ్, అదనపు కోశాధికారి డాక్టర్.సరఫ్ తులసి గుప్త, రాజశేఖర్ గుప్త, వడకట్టు రాజు, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా అధ్యక్షుడు శివకుమార్ సూరిశెట్టి, తెలంగాణ అధ్యక్షుడు వడకట్టు శ్రీకాంత్, కార్యదర్శి అయిత భాస్కర్, మహిళా విభాగం అధ్యక్షురాలు దుర్గా భవాని సూరిశెట్టి, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జాతీయ లీగల్ అడ్వైజర్ క్రాంతికుమార్, కల్వ సితార, అజయ్ గుప్త, సంస్థ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు, బిఆరఎస్ పార్టీ నాయకుడు జైసింహా, బిఆరఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తలారి శ్రీకాంత్ ముదిరాజ్, శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply