...

ఘనంగా పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు

ఘనంగా పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు

హైద‌రాబాద్‌, ఆగస్టు 2, ( అద్దం న్యూస్ ) : పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ విద్యానగర్ లోని ప్రధాన కార్యాలయంలో సోమవారం పింగళి వెంకయ్య 148 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ట్రస్ట్ చైర్మన్ కోడూరు శ్రీదేవి, సంస్థ చైర్ పర్సన్ కోడూరు శ్యామల రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సంస్థ జనరల్ సెక్రెటరీ బంగారు ప్రశాంత్, సెక్రెటరీ సుధాకర్ రెడ్డి లు హాజరై పింగళి వెంకయ్య చిత్ర పటానికి పూలమాలలేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ కోడూరు శ్రీదేవి మాట్లాడుతూ… పింగళి వెంకయ్య కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకుడు రొయ్యూరు శేష సాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేశవ్, బిఆర్ఎస్ నాయకుడు మేడి సత్యనారాయణ, సభ్యులు కరణం సురేష్, విజయ్ యాదవ్, కిరణ్, పాలగంటి లక్ష్మణ్, కర్ర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.