ఫిబ్ర‌వ‌రి 6 నుంచి బిఎంఎస్ అఖిల భారత మహా సభలు

ఫిబ్ర‌వ‌రి 6 నుంచి బిఎంఎస్ అఖిల భారత మహా సభలు

హైదరాబాద్, జ‌న‌వ‌రి 27, అద్దం న్యూస్ : భారతీయ మజ్దూర్ సంఘ్ (బిఎమ్ఎస్) అఖిల భారత మహాసభలు ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో ఒడిస్సా రాష్ట్రం పూరి నగరంలో నిర్వహించ‌నున్న‌ట్లు బిఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లేశం తెలిపారు. మంగళవారం హైద‌రాబాద్‌ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని బిఎంఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిఎమ్ఎస్ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి రాంరెడ్డి, జిహెచ్ఎంసి బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి టి.కృష్ణ తో కలిసి మల్లేశం మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 2500 మంది ప్రతినిధులు ఈ మహాసభలకు హాజరుకానున్నట్లు తెలిపారు. మహాసభలకు కేంద్రమంత్రి మనసుక్ మాండవియా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారని వివరించారు. బ్రిక్స్ దేశాల నుంచి వచ్చే ప్రతినిధుల సదస్సును ఒడిస్సా ముఖ్యమంత్రి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈ సమావేశాల్లో దేశ వ్యాప్తంగా కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం పై దృష్టి సారించడం జరుగుతుందన్నారు. దేశవ్యాప్తంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని, కేంద్ర, రాష్ట్ర వివిధ స్కీంలలో పని చేస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు. ఈఎస్ఐ 21 వేల, నుంచి రూ40 వేలకు పెంచాలని, ఇతర పథకాలకు సీలింగ్ పెంచాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు కార్మిక చట్టాలపై కూడా సమావేశాల్లో చర్చించడం జరుగుతుందన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page