హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం
భారీ వర్షానికి ఊడిపడిన చార్మినార్ పెచ్చులు
హైదరాబాద్, ఏప్రిల్ 3 అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో గురువారం సాయంత్రం వర్సం దంచికొట్టింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. సుమారు రెండు గంటల పాటు ఎడతెరపి వర్షం కురిసింది. నగరంలోని ప్రధాన కూడళ్లల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వర్షానికి తోడు గాలి రావడంతో పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు, చెట్లు కూలిపోయాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం జరిగింది. రాష్ట్ర అంబేద్కర్ సచివాలయం ముందు భారీగా వరద నీరు నిండిపోయింది. దీంతో ఆ దారిన వెళ్లిన వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. మలక్‌పేట్ అండర్‌పాస్ బ్రిడ్జి భారీ వర్షంతో నిండిపోయింది. దీంతో రాకపోకలు పూర్తి బంద్ అయ్యాయి. మరో వైపు భారీ వర్షానికి చరిత్రాత్మక చార్మినార్‌లో ఒక మీనార్‌లోని చివరి భాగం కొంత కూలిన పెచ్చులూడి కిందపడిపోయాయి. కింద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వైపు పెచ్చులూడి పడిపోయింది. ఆ సమయంలో కింద ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న ఆర్కలాజికల్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని కిందపడిపోయిన పెచ్చులూడిన శాంపిల్స్‌ను తీసుకుని పరీక్షిస్తున్నారు. చార్మినార్ ఏమైనా ప్రమాదం ఉందా అని పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చార్మినార్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. గతంలో కూడా మినార్ పై న డిజైన్ ఊడిపడిపోయింది. ఆ సమయంలో కూడా ఎవరికి ఏమి ప్రమాదం జరగలేదు. 











Leave a Reply