చెన్నై, అమృత ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌ బల్కంపేట క్యాంపస్ ఆధ్వర్యంలో తరంగోత్స‌వం

CAIIHM ఆధ్వ‌ర్యంలో తరంగోత్స‌వం

హైదరాబాద్, మే 7, ( అద్దం న్యూస్ ) :   చెన్నైస్ అమృత ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, తమ విద్యార్థుల కోసం ” తరంగోత్స‌వం–2.0 ” ఘ‌నంగా జ‌రిగింది. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని ఆర్టీసి క‌ళా భ‌వ‌న్ ఆడిటోరియంలో గురువారం జ‌రిగిన ఈ కార్యక్రమానికి చెన్నైస్ అమృత ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ బూమీ నాథన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటు ప్రముఖ నటి అలఖ్య హారిక కూడా పాల్గొన్నారు. CAIIHM కి చెందిన విద్యార్థులు, ఒక పుచ్చకాయపై ఆమె ముఖాన్ని చెక్కి తయారు చేసి నటికి బహుకరించారు.

ఈ సంద‌ర్భంగా ఛైర్మన్ బూమీ నాథన్ మాట్లాడుతూ… సిఏఐఐహెచ్ఎం హైదరాబాద్‌లో బల్కంపేట్, ఖైరతాబాద్ అనే రెండు క్యాంపస్లను నిర్వహిస్తోందన్నారు. ఇది ప్రఖ్యాత జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల సహకారంతో అనేక రకాల డిగ్రీ, డిప్లొమా ప్రోగ్రామ్లను అందిస్తోందని తెలిపారు. 16 సంవత్సరాలకు పైగా విద్యారంగంలో అద్భుతమైన పనితీరు కనబరుస్తున్న సిఏఐఐహెచ్ఎం, భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా సుమారు 31,651 మంది విద్యార్థులకు విజయవంతంగా ఉద్యోగాలు కల్పించిందని పేర్కొన్నారు. ఈ సంస్థ తన పటిష్టమైన విద్యా పునాది, పరిశ్రమ- ఆధారిత శిక్షణ, నిరంతర ప్లేస్మెంట్ విజయానికి విస్తృతంగా గుర్తింపు పొందిందన్నారు. ఈ సంద‌ర్భంగా విద్యార్థులు ప్ర‌ద‌ర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అంద‌రిని ఆక‌ట్టుకున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page