స్ట్రోమ్ వాటర్ పైప్‌లైన్‌ పనులను పరిశీలించిన కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ టిఆర్‌టి మెయిన్ రోడ్డు జ‌వ‌హ‌ర్ స్కూల్ వ‌ద్ద జ‌రుగుతున్న స్ట్రోమ్ వాటర్ పైప్‌లైన్‌ పనులను కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ ప‌రిశీలించారు. మంగ‌ళ‌వారం జిహెచ్ఎంసి డిఈ గీత‌, ఏఈ అబ్దుల్ స‌లామ్‌, వ‌ర్క్ ఇన్‌స్పెక్ట‌ర్ మ‌హేష్‌, బిజెపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ జాయింట్ క‌న్వీన‌ర్ విన‌య్ కుమార్‌ల‌తో క‌లిసి కార్పొరేట‌ర్ పావ‌ని ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… అశోక్‌న‌గ‌ర్ నుంచి ఆర్‌టిసి క్రాస్ రోడ్ వ‌ర‌కు వెళ్లే ప్ర‌ధాన ర‌హ‌దారి కావ‌డంతో వాహ‌న‌దారుల‌కు, పాద‌చారుల రాక‌పోక‌ల‌కు తీవ్ర ఆటంకం క‌లుగుతుంద‌న్నారు. జ‌వ‌హ‌ర్ స్కూల్ వ‌ద్ద జ‌రుగుతున్న స్ట్రోమ్ వాటర్ పైప్‌లైన్‌ పనులను త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను కార్పొరేట‌ర్ పావ‌ని ఆదేశించారు. వ‌ర్షాకాలం దృష్ట్యా అధికంగా వర్షాలు కురిసిన‌ సమయంలో వరద నీరు నిలవకుండా కచ్చా నాలా పనులు జరగాలని, అధికారులు వర్షాకాలం ఎమర్జెన్సీ టీమలను ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచాలని కార్పొరేటర్ పావ‌ని సూచించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు శ్రీకాంత్, దామోదర్, ఎం.ఉమేష్, సత్తి రెడ్డి, ప్రకాష్ యాదవ్, శివకుమార్, శ్రీనివాస్, నర్సింహ, ఆనంద్ రావు, సురేష్, మహమూద్, భారత్, ధనరాజ్, నీరజ్, సంయుక్త రాణి స్థానికులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Exit mobile version