ముద్ర, కార్వాన్: లంగర్ హౌస్ ప్రధాన రహదారి వద్ద వ్యక్తి పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… లంగర్ హౌస్ ప్రశాంత్ నగర్ లో నివాసం ఉండే ఎల్ ప్రేమ్ కుమార్ (47) వృత్తిరీత్యా ఆటోడ్రైవర్.
శుక్రవారం రాత్రి ఇంటికి వెళ్లిన అతను భార్యతో గొడవపడ్డారు. ఈ గొడవతో మునస్థాపానికి గురైన ఆయన లంగర్ హౌస్ ప్రధాన రహదారి ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. చుట్టుపక్కల వారు మంటలు ఆర్పి అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply