తుక్కుగూడ ప్రైమ్ కేర్ హాస్పిటల్ ఘటన పై తెలంగాణ రక్షణ సేన ఆందోళన
– బాధితురాలికి న్యాయం చేయాలి
» శంషాబాద్ డిసిపికి వినతి
మహేశ్వరం, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) : మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ పరిధిలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్సుగా విధులు నిర్వహిస్తున్న శిరీష అనే యువతి హత్యకు గురైన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, హాస్పిటల్ యాజమాన్యానికి చెందిన హాస్టల్లో ఉంటున్న సమయంలో ఈ దారుణం జరగడం యాజమాన్య నిర్లక్ష్యానికి నిదర్శనమని తెలంగాణ రక్షణ సేన ( TRS ) మహేశ్వరం నియోజకవర్గం ఇంచార్జ్ కోల శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడంతో పాటు, బాధితురాలి స్వస్థలమైన భద్రాద్రి కొత్తగూడెం వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అధ్యక్షురాలి ఆదేశాల మేరకు ఆదివారం తెలంగాణ రక్షణ సేన మహేశ్వరం ఇన్చార్జ్ కోల శ్రీనివాస్ ఆధ్వర్యంలో శంషాబాద్ డిసిపి ని కలిసి వినతిపత్రం అందచేశారు.
ఈ సందర్భంగా కోల శ్రీనివాస్ మాట్లాడుతూ… భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల ఊకే శిరీష తుక్కుగూడలోని ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో నర్స్ పని చేస్తూ పక్కనే ఉన్న హాస్పిటల్‌కు చెందిన హాస్టల్లోకి వెళ్లి, నిద్రిస్తున్న సమయంలో వంటరిగా ఉన్న శిరీష ను చూసి అక్కడే మెకానిక్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి హాస్టల్ లోకి వెళ్లి హత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడన్నారు. దాదాపు హత్య జరిగి 20 రోజుల అవుతున్న ఇంత వరకు హాస్పిటల్స్, హాస్టల్ లో సెక్యూరిటీ లేకపోవడంతో హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిన ఇప్పటి వరకు హాస్పిటల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నిందితుడిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కంచర్ల శివారెడ్డి, నవీన్ గౌడ్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఇస్మాయిల్, లోకిని రాజు, శివ యాదవ్, రామకోటి, బండారు సరిత పటేల్, వేద భవాని తదితరులు పాల్గొన్నారు. ![]()

![]()













Leave a Reply