అంబర్‌పేట్, ఏప్రిల్ 4, అద్దం న్యూస్ : కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న 1996 బ్యాచ్‌కు చెందిన పి.ఎలియా రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. శుక్రవారం కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌లో రైల్వే ఇన్స్పెక్టర్ ఎల్లప్ప, ఏఎస్సై, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన ఎలియాను అభినందించి, ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎలియా మాట్లాడుతూ.. గతంలో వివిధ పోలీస్ విభాగాల్లో పనిచేసి ఉన్నతాధికారుల మెప్పు పొంది అనేక రివార్డులు, ప్రసాంశ పత్రాలను అందుకున్నట్లు తెలిపారు. రైల్వే పోలీస్‌స్టేషన్‌కు వచ్చే పిర్యాదుదారులకు త్వరితగతిన న్యాయం చేస్తానని హామి ఇచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply