
కాచిగూడ, జూలై 28, ( అద్దం న్యూస్ ) : నింబోలి అడ్డా హర్రాస్‌పెంట వద్ద మంగళవారం ఉదయం 10.40 గంటల సమయంలో ఆర్టీసి బస్సు ఢీకొన్న ప్రమాదంలో సోనాలి జాధవ్ ( 30 ) అనే వివాహిత మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కాచిగూడ తిలక్‌నగర్‌కు చెందిన సోనాలి జాధవ్ అనే మహిళ హీరా జ్యులెలరిలో ఉద్యోగం చేస్తుండేది. ఇదిలా ఉండగా ఈ నెల 28వ తేదీన మంగళవారం ఉదయం నింబోలి అడ్డా హర్రాస్‌పెంట మీదుగా ఆమె టీవీఎస్ జూపిటర్ స్కూటీపై ఉద్యోగానికి వెళ్తుండగా, ( TS 30 T 3688 ) నంబర్ గల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ( బస్సు ముందు చక్రాల కింద పడి ) ఘటన స్థలంలోనే మృతి చెందింది. మృతురాలి సోదరుడు రాహుల్ మోరే ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.![]()

![]()












Leave a Reply