Google Search: 2025లో గూగుల్‌ సెర్చ్‌లో టాప్ టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా?

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మరికొన్ని రోజుల్లో 2025 సంవత్సరం ముగిసిపోయి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో (Google Search) అత్యధికంగా సెర్చ్ అయిన టాలీవుడ్ హీరోల జాబితా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది టాలీవుడ్‌లో అందరి కంటే ఎక్కువగా నెటిజన్లు వెతికిన హీరోగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అగ్రస్థానంలో నిలిచారు.

 

ముఖ్యంగా గత ఏడాది చివర్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించిన ‘పుష్ప 2’ (Pushpa 2) ప్రభావం ఈ ఏడాది మొత్తం కొనసాగింది. దానికి తోడు, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో (Atlee) బన్నీ చేయబోతున్న భారీ ప్రాజెక్ట్ (AA22) గురించిన వార్తలు కూడా ఆయన సెర్చ్ ఇంజిన్‌లో (Google Search) టాప్‌లో నిలవడానికి దోహదపడ్డాయి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

ఈ నెల 24 వరకు ఉన్న గూగుల్ డేటా (Google Search) ప్రకారం, అల్లు అర్జున్ మొదటి స్థానంలో ఉండగా, గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉన్నారు. ప్రస్తుతం బన్నీ చేతిలో అట్లీతో పాటు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా ఉండటంతో, ఆయన క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page