హైదరాబాద్, ఆగస్టు 24, అద్దం న్యూస్ : గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని ఆదేశాలతో ప్రమాదాలు నివారించడానికి హైటెన్షన్ వైర్లను క్రమబద్ధీకరించామని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ మాల బస్తీ మెయిన్ రోడ్డు వద్ద గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న హైటెన్షన్ ఎలక్ట్రికల్ వైర్లను తొలగించి హెచ్ టి బంచ్ కేబుల్ ను ఏర్పాటు చేయాలని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు బస్తివాసులు కోరారు. ఇందుకు స్పందించిన కార్పొరేటర్ పావని విద్యుత్ తీగలను తొలగించి హెచ్ టి బంచ్ కేబుల్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా టిఎస్ పిడిసిఎల్ అడిషనల్ డివిజనల్ ఇంజనీర్ సంపత్, ఏఈ సంతోష్ ల సహకారంతో విద్యుత్ తీగలను తొలగించి హెచ్ టి బంచ్ కేబుల్ ను ఆదివారం బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ ఏర్పాటు చేయించారు. దానికి అనుగుణంగా నూతన ఎలక్ట్రికల్ పోల్ ను ఏర్పాటు చేశారు. వినాయక చవితి సందర్భంగా డివిజన్ లో విద్యుత్ తీగల క్రమబద్ధీకరణ చెట్ల కొమ్మలను తొలగించేందుకు, వినాయక మండపాల ఏర్పాట్లలో ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే తమ కార్పొరేటర్ కార్యాలయం నెంబర్: 77998 19991 కు సంప్రదించాలని బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. తమ ఫిర్యాదు మేరకు ప్రమాదకరంగా ఉన్న హైటెన్షన్ తీగల క్రమబద్ధీకరణ జరిపించిన కార్పొరేటర్ పావని కి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు మదన్మోహన్, గోపి, అరుణ్ కుమార్, రాహుల్, సాయి తేజ, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply