బీసీ కులగణన చేపట్టకపోతే బిజెపినీ గద్దె దింపడం ఖాయం
– తక్షణమే జాతి జనగణను నిలిపివేయాలి
– జనగణన ప్రశ్నావళిని వెంటనే రద్దు చేయాలి
– జాతి జనగణపై జాతీయస్థాయిలో అఖిలపక్ష పార్టీలు సామాజిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేయాలి
– బీసీలను నమ్మించి వంచించితే దేశంలో బిజెపికి ఇదే చివరి పాలన అవుతుంది
– బీసీ కులగనను వ్యతిరేకిస్తే బిజెపి నేతలకు పిండ ప్రధానo పెడతాం
– అసెంబ్లీలో వ్యతిరేకిస్తే బిజెపి కార్యాలయం ముందు వంటవార్పు నిర్వహిస్తాం
– వచ్చే నెలలో లక్షలాదీ మందితో పార్లమెంట్ ముట్టడి చేపడతాం
» బీసీల ధర్మ పోరాట దీక్షలు బిజెపి పై తీవ్రంగా మండిపడ్డ జాజుల శ్రీనివాస్ గౌడ్, వీహెచ్, మధుసూదనాచారి, నెల్లి కంటి సత్యం, ఈరావత్ అనిల్ ల వెల్లడి
హైదరాబాద్, సెప్టెంబర్ 11, ( అద్దం న్యూస్ ) : దేశంలోని ఎనబై కోట్ల మంది బీసీల జీవితాలతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెలగాటమాడుతుందని, పేరుకు కులగనన చేస్తున్నామని చెప్తూనే కులగనన ప్రశ్నావళిలో బీసీ కాలం చేర్చకుండా, ప్రతి కులానికి యూనికోడ్ కేటాయించకుండా బీసీలను నమ్మించి వంచిస్తుందని, ఇదే వైఖరి అవలంబిస్తే దేశంలోని బీసీలు ఒక్కటై బిజెపిని గద్దె దించడం ఖాయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రధాని నరేంద్ర మోడీని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం జరుగుతున్న జాతి జనగణనలో ఓబీసీ కాలం చేర్చాలని, ప్రతి కులానికి ఒక యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపుమేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో బీసీల ధర్మ పోరాట దీక్షలు చేపట్టారు. అందలో భాగంగానే హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద పెద్ద ఎత్తున బీసీల ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు, బిఆర్ఎస్ శాసన మండలి సభా పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ తో పాటు 80 కుల సంఘాలు, 30 బీసీ సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళ, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… బీసీలకు ఎలాంటి ప్రయోజనం లేని జాతి జనగణను తక్షణమే నిలిపివేయాలని, కేంద్ర ప్రభుత్వం 40 ప్రశ్నలతో ఇచ్చిన గెజిట్ ను రద్దుచేసి జాతీయస్థాయిలో అఖిలపక్ష పార్టీలు, సామాజిక నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాతనే జనగణన ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని బీసీ సమాజమంతా బీసీ లెక్కలు కావాలని, బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని ఉద్యమిస్తుంటే బీసీ ప్రధాని అయి ఉండి కూడా బీసీలకు న్యాయం చేయడం లేదని, బిజెపి బీసీలు ద్రోహుల పార్టీగా వ్యవహరిస్తుందని ఆయన తీవ్రంగా మండిపడ్డారు, బీసీ కులగన చేపట్టని బిజెపి నాయకులకు బీసీ బీసీలు అంతా కలిసి పిండ ప్రదానం చేస్తామని ఆయన తీవ్రంగా హెచ్చరించారు, ఈనెల 20వ తేదీన హైదరాబాద్లో బీసీ కులగణన పై జాతీయ సదస్సు నిర్వహిస్తున్నామని, ఆ సదస్సులో దేశవ్యాప్తంగా మరో మండల్ ఉద్యమానికి రూపకల్పన చేస్తామని, కేంద్రం దిగి వచ్చే వరకు ఉద్యమాన్ని గల్లి నుంచి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
ప్రభుత్వ సలహాదారులు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే ఈరావత్రి అనిల్ కుమార్ లు మాట్లాడుతూ… బీసీ కులగనన చేయకుండా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, బీసీ కాలం చేర్చాలని ప్రధాన డిమాండ్ కాంగ్రెస్ పార్టీ జాతీయస్థాయిలో వంద రోజుల పాటు దేశ వ్యాప్తంగా సభలో సమావేశాలు ఏర్పాటు చేస్తుందన్నారు. వంద రోజుల తర్వాత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఢిల్లీలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహించి బీసీల నిరసన సెగను కేంద్రానికి రుచి చూపిస్తామని వారు తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ శాసన మండలి సభాపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి మాట్లాడుతూ… దేశంలో బీసీలకు నిజమైన స్వాతంత్రం రాలేదని బీసీలను ప్రభుత్వాలు మనుషులుగా కూడా గుర్తించకపోవడం అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ… నాటి మండల్ నుండి నేటి కులగలను వరకు బిజెపి డీఎన్ఏ లోని రిజర్వేషన్ల వ్యతిరేక భావన ఉన్నదని, బీసీ లెక్కలు తీస్తే బీసీలకు రిజర్వేషన్లు జనాభా దామాషా ప్రకారం పెంచవలసి వస్తుందని కుట్రతోనే ఆదిలోనే బీసీ లెక్కలు తీయకుండా బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ ధర్మ పోరాట దీక్ష సభాధ్యక్షులుగా కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ వ్వహరించగా, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కుర్మా, బీసీ జేఏసీ నేతలు పిట్ల శ్రీధర్, ఉప్పరి శేఖర్ సగర, మహిళ సంఘం అధ్యక్షురాలు బి.మనిమంజరి, కాటేపల్లి వీరస్వామి, ఎం.చంద్రశేఖర్ గౌడ్, శ్రీనివాస్, డాక్టర్ రమ, మహేష్ యాదవ్, జాజుల లింగం గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, రావులకోల్ నరేష్ ప్రజాపతి, దీటి మల్లయ్య, తారకేశ్వరి, సంధ్యా రాణి, స్వర్ణ గౌడ్, పానుగంటి విజయ్ గౌడ్, నరసింహ నాయక్, కవుల జగనాథం, ఇంద్రం రజక, బూడిద మల్లికార్జున్ యాదవ్, శ్యామల, గౌతమి, వెంకటేష్ గౌడ్, భూదాని సదానందం, లక్ష్మీనారాయణ, బ్రహ్మచారి, దేవిక తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply