టిడిపి నగర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్, ఆగస్టు 15, అద్దం న్యూస్ : దోమలగూడలోని హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా హాజరై జాతీయ జెండాను ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎందరో తమ జీవితాలను త్యాగం చేసిన అమర జవానుల బలిదానాలతో స్వాతంత్య్రం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజు గౌడ్, ఎంకె.బోసు, పరుశురామ్, ఎస్.ప్రకాష్, సిద్ధిఖి, శ్రీనివాస్ గౌడ్, భాను ప్రకాష్, కిరణ్, వెంకటేష్ చౌదరి, సిహెచ్.ప్రదీప్ గౌడ్, లయిఖుద్దీన్, ఎన్.శ్రీనివాస్, జి.ప్రవీణ్, ఎన్.జగదీష్ గౌడ్, బి.రాజు, యాదగిరి, రమేష్, కాతా విజయ్ కుమార్, రామారావు, టి.అనిల్, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply