హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :
ఈ నెల 16 న జరిగే అలంపూర్ శ్రీ జోగుళాంబ అమ్మవారి కల్యాణోత్సవంలో పాల్గొనాల్సిందిగా కోరుతూ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ని ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. దేవాదాయ శాఖ కమిషనర్ ఎం.హన్మంతరావు, గద్వాల సంస్థాన వారసుడు కృష్ణ రామభూపాల్, శ్రీ జోగుళాంబ అమ్మవారి దేవస్థానం ఈవో దీప్తి తదితరులు ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్ నివాసంలో శుక్రవారం కలిసి ఆహ్వానం అందజేశారు. ![]()

![]()
