తెలంగాణ‌ను అభివృద్ధి చేసిన ఘ‌న‌త ఎన్‌టిఆర్‌ దే – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్

తెలంగాణ‌ను అభివృద్ధి చేసిన ఘ‌న‌త ఎన్‌టిఆర్‌ దే
» టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్

హైదరాబాద్, జ‌న‌వ‌రి 18, అద్దం న్యూస్ :   తెలంగాణ‌ను అభివృద్ధి చేసిన ఘ‌న‌త ఎన్‌టిఆర్‌, చంద్ర‌బాబుల‌దే అని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, చిక్క‌డ‌ప‌ల్లి డివిజ‌న్ మాజీ కార్పొరేట‌ర్ ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ అన్నారు. టిడిపి వ్య‌వ‌స్థాప‌కులు, మాజీ సీఎం దివంగ‌త ఎన్‌టి రామారావు 30వ వ‌ర్థంతి సంద‌ర్భంగా ఆదివారం హైద‌రాబాద్ చిక్క‌డ‌ప‌ల్లి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యంలో ప‌లుస బాల్‌రాజ్‌గౌడ్ ప్ర‌త్యేక పూజ‌ల‌ను నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పేద‌ల‌కు పులిహోర‌ ప్యాకెట్ల‌ను ఉచితంగా అంద‌చేశారు. అలాగే అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తా వ‌ద్ద, ముషీరాబాద్ గంగ‌పుత్ర‌కాల‌నీలో గ‌ల‌ ఎన్‌టిఆర్ విగ్ర‌హాల‌కు పూల‌మాల‌లేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధి కోసం ఎన్‌టిఆర్‌తో పాటు చంద్ర‌బాబు ఎన‌లేని కృషి చేశార‌న్నారు. ఎన్‌టిఆర్ పేద‌, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి నాయ‌కులు డి.చంద్ర‌మోహ‌న్‌గౌడ్‌, శంక‌ర్‌, పుల్ల‌య్య‌, ఉద‌య్ కుమార్ గుప్త‌, నాయుడు, యాద‌గిరి, గోపాల్‌, ద‌శ‌ర‌త్‌, అన్న‌పూర్ణ‌, వాణి త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page