తెలంగాణ ఉద్య‌మంలో పౌరుల హ‌క్కుల‌ను కాపాడిన చ‌రిత్ర‌ జ‌స్టీస్ బి.సుభాషణ్‌ రెడ్డిది

తెలంగాణ ఉద్య‌మంలో పౌరుల హ‌క్కుల‌ను కాపాడిన చ‌రిత్ర‌ జ‌స్టీస్ బి.సుభాషణ్‌ రెడ్డిది

రంగారెడ్డి జిల్లా, మార్చి 23, అర్థం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో సైతం రాష్ట్రంలోని పౌరుల హక్కులను కాపాడిన చరిత్ర బి.సుభాషణ్‌ రెడ్డిది అని రంగారెడ్డి జిల్లా న్యాయ‌వాదుల సంఘం నాయ‌కులు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, కార్యదర్శి బి.కార్తీక్, సంఘం సభ్యులు ఆధ్వర్యంలో జస్టిస్ బి.సుభాషణ్‌ రెడ్డి ఫోటోతో పాటు 1996 నుండి 2020 వరకు పనిచేసిన న్యాయవాదుల సంఘాల న్యాయ‌వాదుల‌ ఫోటోలను, జిల్లా జడ్జ్ కరణ్ కుమార్ ఫోటోలను బార్ అసోసియేషన్ హాల్‌లో సోమ‌వారం ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎస్.ప్రతాపరెడ్డి, కార్యదర్శి బి.కార్తీక్, తెలంగాణ రాష్ట్ర గ్రామ పంచాయతీ మాజీ ట్రిబ్యునల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి, మాజీ బార్ కౌన్సిల్ చైర్మన్ ఎం.రాజేందర్ రెడ్డి, హైకోర్టు న్యాయవాది మహేందర్ రెడ్డి మాజీ కార్యదర్శి ఎండి.నజీబ్, మాజీ అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యద‌ర్శులు మధుసూదన్, ఇంధ్ర‌సేనా రెడ్డి, మహేష్ కుమార్, బార్ కౌన్సిల్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… జస్టిస్ బి.సుభాషణ్‌ రెడ్డి రంగారెడ్డి జిల్లా వాసిగా తన న్యాయవాది వృత్తిని జిల్లా కోర్టు నుండి మొదలుపెట్టి హైకోర్టులో నిర్వహించడం జరిగిందన్నారు. ఏపీ హైకోర్టులో జడ్జిగా, మద్రాస్ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా ఆయ‌న పనిచేయడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు చైర్మన్‌గా బి.సుభాషణ్‌ రెడ్డి పని చేశారని పేర్కొన్నారు. కెసిఆర్ ఖమ్మం జిల్లా జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్య రీత్యా ఆయ‌న‌ను హైదరాబాద్ నిమ్స్‌కు బి.సుభాషణ్‌ రెడ్డి తరలించారని గుర్తు చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులపై అంశాలు విధించినప్పుడు కమిషన్ సభ్యుడిని ఓయుకు పంపించి విచారణ చేయించి తగు చర్యలు తీసుకొని అప్పటి ప్రభుత్వానికి బి.సుభాషణ్‌ రెడ్డి వ్యతిరేకంగా తీర్పునిచ్చారని అన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page