గోదావరిఖని, అద్దం న్యూస్ : మే 12వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న అరుణోదయ 50వ వసంతాల ముగింపు సభను విజయవంతం చేయాలని అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ కోరారు. బుధవారం గోదావరిఖనిలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ( ఏసిఎఫ్ ) ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్యుల సమావేశం చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅధితి గా అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్ హాజరై మాట్లాడుతూ…
మే 12వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగనున్న అరుణోదయ 50 వసంతాల ముగింపు సభలకు అధిక సంఖ్యలో కవులు, కళాకారులు, రచయితలు, ప్రజలుతరలి వచ్చి జయప్రదం చేయాలన్నారు. ప్రజా సంస్కృతిని ధ్వంసం చేయడానికి పాలక వర్గాలు అశ్లీల సాహిత్యన్ని, సంస్కృతిని పెంపొదిస్తున్నాయన్నారు. కులం – మతం పేర అంతరాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ప్రజల కట్టు బొట్టు, ఆహారం, సంప్రదాయాలను కాషాయ మాయం చేస్తున్నాయన్నారు. పాఠ్యంశాలలో కూడా అభూతకల్పనలను జోడించి చరిత్ర పేర మహనీయులను విష్మరిస్తున్నారన్నారు.పెరిగిపోతున్న అశ్లీల సాహిత్యనికి వ్యతిరేఖంగా కవులు, కళాకారులు ఉద్యమించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. కార్మిక కర్షక, పిడిత ప్రజల పోరాటల్లో కళాకారులు మరిన్ని కళారుపాలు సృష్టించాలన్నారు.
మధ్య భారతంలో ఖనిజాల కోసం సామ్రాజ్యశక్తులు, కేంద్ర దళారీ పాలకుల కుట్రల్లో ఆదివాసులు హత్యగావించబడుతున్నారన్నారు. ఆపరేషన్ కాగర్ పేర మరణాహోమం జరుగుతుందని.. ఆ ఆపరేషన్ కాగర్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ ప్రాంతాల్లో మోహరించిన సైనిక బలగాలను వెనక్కి రప్పించాలన్నారు. దేశంలో రాష్ట్రంలో శాంతి కొరకు సిపిఐ మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపాలని డిమాండ్ చేశారు. అనంతరం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆడహాక్ కమిటిని ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా జె.చిన్నయ్య, కో – కన్వీనర్‌గా శ్రీనివాస్, సభ్యులుగా కె.పద్మ, సిహెచ్.యాకుబ్, జి.నారాయణ, పల్లె రాజేశం, మోహన్ లను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఏసిఎఫ్ నాయకులు పల్లె లింగయ్య, ఏఐఎఫ్టియు నాయకులు టి.రత్నకుమార్, ఎం.రాయమల్లు, ఎం.పోచమల్లు, ఆర్సిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెల్తురు సదానందం, పీఓడబ్ల్యూ ( స్త్రీవిముక్తి ) కన్వీనర్ లావణ్య తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png










Leave a Reply