జవహ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ పున‌ర్నిర్మాణం ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభిస్తాం – కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్

జవహ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ పున‌ర్నిర్మాణం ప‌నులు త్వ‌ర‌లో ప్రారంభిస్తాం

– కార్పొరేట‌ర్ పావ‌ని విన‌య్ కుమార్


హైదరాబాద్, ఆగ‌స్టు 07, అద్దం న్యూస్ :    జ‌వహ‌ర్‌న‌గ‌ర్ క‌మ్యూనిటీహాల్ పున‌ర్నిర్మాణం ప‌నులను అతి త్వ‌ర‌లో ప్రారంభిస్తామ‌ని గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ ఎ.పావ‌ని విన‌య్ కుమార్ అన్నారు. గురువారం కమ్యూనిటీహాల్ ప్రాంగణంలో కమిటీ సభ్యులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కార్పొరేటర్ పావ‌ని అధికారుల పై మండిపడ్డారు. ఈ సమావేశానికి హాజరైన డిప్యూటీ కమిషనర్ రామానుజుల‌ రెడ్డి, డిప్యూటీ ఇంజనీర్ గీత, అసిస్టెంట్ ఇంజనీర్ అబ్దుల్ సలామ్ లు మాట్లాడుతూ… మరో 15 రోజుల్లో కమ్యూనిటీహాల్ రినోవేషన్ పనులు ప్రారంభిస్తామని, అందుకు అన్ని చర్యలు పూర్తి అయిన‌ట్లు అధికారులు కార్పొరేటర్ పావ‌నికి వివరించారు. కార్పొరేటర్ పావ‌ని నివేదిక ప్రకారం త్వరలో స్థానికులకు శుభకార్యాలు, ప్రభుత్వ, ఇతరాత్ర కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు అనుగుణంగా, సకల సౌకర్యాలతో జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ రెనోవేష‌న్‌ పనులు ప్రారంభిస్తామని కార్పొరేటర్ పావ‌నికి హామీ ఇచ్చారని అన్నారు. ఈ సంద‌ర్భంగా కార్పొరేట‌ర్ పావ‌ని మాట్లాడుతూ… జవహర్‌న‌గ‌ర్ కమ్యూనిటీహాల్ అభివృద్ధిలో భాగంగా పునర్నిర్మాణం పనుల కొరకు సుమారు రూ. 26 లక్షల నిధులను కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సహకారంతో జిహెచ్ఎంసి నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, ఎస్ఆర్‌టి జవహర్‌నగర్ వ్యాయామశాల, ఆటస్థలం, కళ్యాణ మండప పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నర్మెట మల్లేష్, కమిటీ సభ్యులు గుండు సురేందర్, మహేందర్, ఎం.కృష్ణ, జగదీష్, దినేష్, సలీమ్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page