డ్రైనేజీ పైప్‌లైన్లు వేసిన తర్వాతే రోడ్డు వేయాలి
– బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 24, అద్దం న్యూస్ : ముషీరాబాద్ డివిజన్ మోహన్‌నగర్, జాంభవినగర్ బస్తీల్లో డ్రైనేజీ పైప్‌లైన్లు వేసిన తర్వాతే రోడ్డు వేయాలని బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి అన్నారు. రోడ్డు వేసేందుకు జిహెచ్ఎంసి ఏఈ శ్రీనివాస్ రోడ్డు వేసేందుకు తగిన ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన విషయం తెలుసుకున్న చిలకలగూడ వాటర్ వర్క్స్ మేనేజర్ శివసాయి, బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి తదితరులు మోహన్‌నగర్, జాంభవినగర్ బస్తీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కొండ శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… సిసి రోడ్డు, డ్రైనేజీ పైప్‌లైన్ల కోసం ఎమ్మెల్యే ముఠా గోపాల్ నిధులను మంజూరు చేయించారన్నారు. డ్రైనేజీ పైప్‌లైన్లను వేసిన తర్వాతనే సిసి రోడ్డు వేయాలని జిహెచ్ఎంసి, జలమండలి అధికారులను కోరారు. బస్తీవాసులు గండి కృష్ణ, మహిళలు పాల్గొన్నారు.














Leave a Reply