కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి
కామారెడ్డి, సెప్టెంబర్ 4, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నుంచి బిచ్కుందకు వెళ్తుండగా కామారెడ్డి జిల్లా జుక్కల్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చి రక్షణ గోడను ఢీకొట్టిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 13 మంది ప్రయాణికులు ఉన్నారు. క్షతగాత్రులను బిచ్కుంద ఆసుపత్రికి తరలించారు. ![]()













Leave a Reply