బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పు !
– పార్టీ మారిన ఎమ్మెల్యేల పై 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి – సుప్రీం కోర్టు

తెలంగాణ బ్యూరో, జులై 31, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పీకర్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు స్పీకర్ మూడు నెలలో నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మేము ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందని.. అందుకే స్పీకర్‌కు నిర్ణయం తీసుకోమని సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ బృందం గడువు ఇచ్చింది. 3 నెలల తర్వాత విచారణను పొడిగించడానికి ఎమ్మెల్యేలు ప్రయత్నిస్తే, స్పీకర్ ప్రతికూల నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. గతంలో రాజేష్ పైలట్, దేవేంద్రనాథ్ మున్షీ మాట్లాడిన విషయాలను పరిశీలించామని.. డిస్ క్వాలిఫికేషన్ కేసులను కోర్టుల వద్ద ఆలస్యం కాకుండా పరిష్కరించడానికి ఆ రాష్ట్ర స్పీకర్‌కు ఈ బాధ్యత అప్పగించారని తేల్చామని సీజేఐ తెలిపారు. పెద్ద బెంచ్ ఎదుట ఇష్యూ పెండింగ్‌లో ఉందన్న వాదనపై కూడా చర్చించామని ఆయన పెర్కొన్నారు. ఆ కేసులో ఆర్టికల్ 136, 226 ల కింద జ్యుడిషియల్ రివ్యూ పరిమితంగా ఉంటుందని సుప్రీం చీఫ్ జస్టిస్ గవాయ్ స్పష్టం చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply