నల్లవెల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా మల్లన్న స్వామి గొల్ల కేతమ్మల, మేడల దేవి ల కళ్యాణం మహెత్సవం

హైదరాబాద్, ఆగస్టు 04, అద్దం న్యూస్ : ఐఎన్‌టియుసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ముషీరాబాద్ నియోజకవర్గం భోలక్‌పూర్ మల్లిఖార్జునస్వామి ( మల్లన్న ) దేవాలయం రెనోవేషన్ కమిటీ ఛైర్మన్ నల్లవెల్లి అంజిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బాకారంలోని ఆయన నివాసంలో ఘనంగా మల్లన్న స్వామి గొల్ల కేతమ్మల, మేడల దేవి ల కళ్యాణం మహెత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఒగ్గు పూజారులతో పాలు పట్టుట కార్యక్రమంతో పాటు సత్యానారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లిఖార్జునస్వామి ( మల్లన్న ) దేవాలయం మాజీ చైర్‌పర్సన్ నల్లవెల్లి ఊర్మిళా అంజిరెడ్డి, మల్లిఖార్జున్‌రెడ్డి, పంతులుతో పాటు పలువురు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply