...

బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా


హైదరాబాద్, ఆగ‌స్టు 06, అద్దం న్యూస్ :    బీసీల అభ్యున్నతికి, సామాజిక న్యాయంకోసం నిబద్ధతతో కృషి చేసింది కేవలం తెలుగుదేశం పార్టీ అని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధ‌వారం హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… పదేళ్లు అధికారంలో ఉండి ఏనాడో బీసీల ఉసెత్తని బిఆర్ఎస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ 42 శాతం రిజర్వేషన్లంటూ ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ అని మరోసారి ప్రజలను ప్రజలను వంచించడానికి చేస్తున్న ప్రయత్నాలేనని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసామంటూ, ఆర్డినెన్స్ గవర్నరుకు పంపడం వల్ల ఏప్రయోజనం లేదన్నారు. ఆర్డినెన్స్ వల్ల ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. బలహీన వర్గాల ప్రజలకు సమాజంలో సమున్నతమైన స్థానం, రిజర్వేషన్లు కల్పించి, బిసిలను సామాజిక, ఆర్థిక, రాజకీయంగా ప్రాధాన్యం కల్పించింది తెలుగుదేశం అని అన్నారు.  1982 లో స్వర్గీయ ఎన్‌టి రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి బీసీలకు రాజకీయ భవిష్యత్తును కల్పించింద‌న్నారు. నిరుపేద, బలహీన వర్గాలకు పెద్దపీట వేసి, రాజకీయ అవకాశాలను కల్పించింద‌న్నారు. 1987లో, రాష్ట్ర స్థాయి సంస్థల ఎన్నికలలో మురళీధర్ రావు కమిషన్ చేసిన సిఫార్సుల మేరకు బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి ప్రభుత్వం తెలుగుదేశం అని అన్నారు. ఎన్‌టిఆర్ ఛైర్మన్‌గా ఉన్న నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్ర స్థాయి ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లను అమలు చేసామ‌న్నారు. రాష్ట్ర శాసనసభ, పార్లమెంట్‌లో బిసిలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రానికి రాజ్యాంగ సవరణ కొరకు తీర్మానం పంపామ‌న్నారు.                            బిసిల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి నారా చంద్రబాబు నాయుడు పాలనలో బీసీల విద్యా, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. పేదరిక నిర్మూలన కోసం “వెలుగు” గీత కార్మికులకు, గొర్రెల కాపరులకు బంజరు భూములలో గొర్రెల మేపు కొరకు అనుమతి, రోడ్డు పక్కన తుమ్మకాయలను సేకరించుకునే అనుమతి నాయి బ్రాహ్మణులకు తీర్థయాత్ర స్థలాలలో దుకాణాల ఏర్పాటు, మత్స్యకారులకు వలలు, పడవలు, తెడ్లకు సబ్సిడీ రుణాలు అందించామ‌ని గుర్తు చేశారు. చేనేత రంగానికి చేయూత కొరకు సగం ధరకే జనతా వస్త్రాల పథకం అమలు.నిల్వ ఉన్న వస్త్రాలను 10 శాతం రిబేట్‌, 15 కోట్ల గ్రాంట్. 10 శాతం సబ్సిడీతో 10 కోట్ల గ్రాంట్, లూమ్-కమ్-వర్క్‌షెడ్‌లు ( ఒకటి రూ. 25,000 చొప్పున ) వీవర్స్‌కు క్రెడిట్ కార్డ్ సిస్టమ్‌ను మొదటిసారి ప్రవేశపెట్టామ‌న్నారు. పవర్ లూమ్స్‌కు 50 శాతం విద్యుత్ సబ్సిడీ, “ఆదరణ” పథకం అమలు చేసి, వివిధ చేతివృత్తుల వారికి ఆధునిక పరికరాలు దాదాపు 6 లక్షల మందికి లబ్ధి చేకూరిందన్నారు. బీసీ విద్యార్థులు ఇతరులతో పోటీ పడేలా విద్యా అవకాశాలు కల్పించి, విద్యను ఒక ఆయుధంగా పేదరికం నుండి బయటపడటానికి తెలుగుదేశం చేసిన వినూత్న కార్యక్రమం చేపట్టిందన్నారు. మత్స్యకారుల పిల్లలకు 61 ఆశ్రమ పాఠశాలలు, వడ్డెర, గొర్రెల కాపరుల పిల్లల కోసం 22 ఆశ్రమ పాఠశాలలు. 1427 హాస్టళ్లు ఏర్పాటు చేశార‌ని, 10 వ తరగతి వరకు ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ, పోటీ పరీక్షలకు ప్రత్యేక శిక్షణా తరగతులు, బిసీలకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. కేంద్రంలో బీసీల కోసం ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ సూచిస్తుందన్నారు. ఇంతకాలం బీసీలకు ఏపార్టీ ఏం చేశారో తెలియజేయాలని, మాట్లాడితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన పార్టీ అని చెప్పుకోవడం కాదన్నారు. అసలు బీసీలకు ఏం చేశారో చెప్పాలని సాయిబాబా అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు కాంగ్రెస్, బిఆర్ఎస్ ఏదో చేశామని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగమే గాని దీని వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఇవన్నీ కేవలం బీసీలను మభ్య పెట్టడానికి రెండు పార్టీలు చేస్తున్న కుట్రలేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.