టెక్సాస్‌లో కలకలం.. భారత సంతతి విద్యార్థి అరెస్టు

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: అమెరికాలో ఉంటున్న ఒక భారత సంతతి విద్యార్థి ఉన్మాదంతో ప్రవర్తించిన ఘటన టెక్సాస్‌లో కలకలం రేపింది. సొంత కుటుంబ సభ్యులపైనే వరుస దాడులకు దిగుతూ, విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్న మనోజ్ సాయి లేళ్ల (22) అనే యువకుడిని కొల్లిన్ కౌంటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

 

టెక్సాస్ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్న మనోజ్ సాయి, గత కొంతకాలంగా తన కుటుంబ సభ్యులను తీవ్రంగా వేధిస్తున్నట్లు సమాచారం. తెలుగు మూలాలున్న ఈ యువకుడు తరచూ ఇంట్లో గొడవ పడటం, కుటుంబ సభ్యులపై దాడులు చేస్తూ చంపేస్తానని బెదిరింపులకు దిగడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

 

పోలీసుల కథనం ప్రకారం, మనోజ్ సాయి కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలతో (Mental Health Issues) ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే అతడు ఇంతటి తీవ్రమైన చర్యలకు పాల్పడి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడిని జైలుకు తరలించిన పోలీసులు, ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page