ఉద్యమకారుల హామీల అమలును స్వాగతిస్తున్నాం – జన సమితి నేత నర్సయ్య

ఉద్యమకారుల హామీల అమలును స్వాగతిస్తున్నాం
• జన సమితి నేత నర్సయ్య

హైదరాబాద్, ఫిబ్రవరి 21, అద్దం న్యూస్ :   తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సబ్ కమిటీ వేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడానికి తెలంగాణ జన సమితి స్వాగతిస్తుందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ హైదరాబాద్ అధ్యక్షుడు తెలంగాణ ఉద్యమకారుడు ఎం.నరసయ్య అన్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకరు ఒక ప్రక్కన చేస్తూ ఉద్యమకారులకు 250 గజాల స్థలం అంశాన్ని పరిశీలిస్తామని చెప్పడం హర్షించదగ్గ విషయం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా హామీల అమలు కోసం సబ్ కమిటీ వేయడం దీనికి పరిష్కారం పరిష్కారమని ఈ సబ్ కమిటీకి ఆనాటి జేఏసీ చైర్మన్, ప్రొఫెసర్ కోదండ రామ్‌ను నియమించాలని కోరారు. ఉద్యమకారులను గుర్తించడం, వారికి ఐడెంటి కార్డులు ఇవ్వడం ,అర్హులైన ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వడం, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్ ఇవ్వడం వంటి అంశాలను పరిష్కరించడానికి పారదర్శకమైన కమిటీ అవసరమని నరసయ్య అభిప్రాయపడ్డారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమకారులను గుర్తించి వారిని ఆదుకోవాలని ఆయన కోరారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం పలు దఫాలుగా కోదండరాం నేతృత్వంలో ప్రభుత్వ పెద్దలను కలవడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఉద్యమకారులకు న్యాయం చేయడానికి ముందుకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు నరసయ్య కృతజ్ఞతలు తెలియజేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page