హైదరాబాద్, జూన్ 16, అద్దం న్యూస్ : తుప్పుపట్టిన విద్యుత్ స్థంభాల స్థానంలో నూతన స్థంభాలను ఏర్పాటు చేయిస్తామని ఆజామాబాద్ డివిజన్ విద్యుత్ శాఖ ఏడిఈ వినోద్ కుమార్ అన్నారు. ముషీరాబాద్ డివిజన్ భరత్‌నగర్ 1-6-59 నుండి 1-6-85 వరకు ఉన్న విద్యుత్ స్థంభాలు తుప్పుపట్టాయని, వాటిని మరమ్మతులు చేయించాలని కోరుతూ బస్తీ వాసులు ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో సోమవారం విద్యుత్ శాఖ ఏడిఈ వినోద్ కుమార్, ఏఈ సునీల్‌రెడ్డి , ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి తదితరులు భరత్‌నగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏడిఈ వినోద్ కుమార్ మాట్లాడుతూ… తుప్పు పట్టిన స్థంభాల స్థానంలో నూతన స్థంభాలను ఏర్పాటు చేస్తామన్నారు. ముషీరాబాద్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ… భరత్‌నగర్ బస్తీలో చాలా రోజులుగా తుప్పుపట్టిన విద్యుత్ స్థంభాలతో ప్రజలు భయాబ్రాంతులకు గురవుతున్నారన్నారు. ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లడం,, ఆయన ఆదేశాల మేరకు అధికారులు స్పందించారన్నారు. రోజు రెండుల్లో నూతన స్థంభాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు పులిగిల్ల శ్రీధర్‌చారి, బస్తీవాసులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply
Cancel reply