వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాలి – ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా

వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాలి

– ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా

హైదరాబాద్, ఆగ‌స్టు 19, అద్దం న్యూస్ :   ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు, కంటెస్ట‌డ్ ఎమ్మెల్యే అభ్య‌ర్థి భూంపల్లి అశోక్ దాదా డిమాండ్ చేశారు. సోమ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… జ‌న్మ‌తః సారావృత్తి, మాంసం వృత్తి ఆరె క‌టిక‌ల‌దే అని అన్నారు. ఎక్సైజ్ అధికారుల దాడుల‌లో ఆరె క‌టిక‌లు అనేక అక్ర‌మ కేసుల‌పాల‌య్యార‌ని వాపోయారు. గ‌త ప్ర‌భుత్వం పిలుపుమేర‌కు నాటు సారా కాయ‌డం మానేసిన ఆరె క‌టిక‌ల‌కు నూత‌న ఎక్సైజ్ పాల‌సీ 2021లో ఎటువంటి రిజ‌ర్వేష‌న్ క‌ల్పించలేద‌న్నారు. వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పిస్తామ‌ని గ‌త ప్ర‌భుత్వం మాట ఇచ్చి మోసం చేసింద‌న్నారు. ఈ సంవ‌త్స‌రం సెప్టెంబ‌ర్‌లో తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హించే వైన్స్ టెండ‌ర్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు 30 శాతం రిజ‌ర్వేష‌న్‌ను క‌ల్పించాల‌న్నారు. 500 కోట్ల నిధుల‌తో ప్ర‌త్యేక కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేశారు. బిసి డి నుంచి బిసి ఎ హోదా క‌ల్పిస్తూ జిఓ తీసుకురావాల‌ని కోరారు. ఇంటిగ్రేటెడ్ మ‌ట‌న్ మార్కెట్ల‌ల్లో ఆరె క‌టిక‌ల‌కు పూర్తి హ‌క్కును క‌ల్పిస్తూ జిఓ తేవాల‌ని, మేక‌లు తేవ‌డానికిపోయి వ‌స్తున్న క్ర‌మంలో ప్ర‌మాదంలో చ‌నిపోయిన ఆరె క‌టిక‌ల‌కు రూ.25 ల‌క్ష‌ల యాక్సిడెంట‌ల్ ఇన్సూరెన్స్‌ను వ‌ర్తింప‌చేయాల‌న్నారు. ఈ సమావేశంలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వ‌ర్‌, ఉపాధ్యక్షులు ర‌మేష్‌, వెంక‌టేష్‌, ప్రేమ్‌కుమార్‌, శ్రీనివాస్‌, కోశాధికారి దినేష్, జాయింట్ సెక్ర‌ట‌రి న‌రేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page