Cm Revanth : అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది

అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీ, జూలై 28, ( అద్దం న్యూస్ ) :   అత్యాధునిక సాంకేతిక పరిశ్రమలు, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుకు అనుకూల వాతావ‌ర‌ణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి ( సీఈఓ ) పవన్ కె.చందన, సహ వ్యవస్థాపకుడు, ముఖ్య నిర్వహణ అధికారి ( సీఓఓ ) భరత్ డాకా ఢిల్లీలో ముఖ్యమంత్రిని మంగ‌ళ‌వారం మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. భారతదేశంలోనే ప్రైవేటు రంగం అభివృద్ధి చేసిన తొలి ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్–1 ను విజయవంతంగా ప్రయోగించిన తీరును వారు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ విజయంతో అమెరికా, చైనా తర్వాత ప్రైవేటు రంగం ద్వారా ఆర్బిటల్ ప్రయోగ సామర్థ్యాన్ని సాధించిన ప్రపంచంలోని మూడో దేశంగా భారత్ నిలిచిందని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక రంగాల పురోగతి, ఆవిష్కరణలు, అధునాతన తయారీ, పరిశోధన–అభివృద్ధి ( ఆర్ అండ్ డి ), ప్రభుత్వం–ప్రైవేటు అంతరిక్ష పరిశ్రమల మధ్య సహకార అవకాశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా స్కైరూట్ వ్యవస్థాపకులను సీఎం రేవంత్ అభినందించారు. వారు సాధించిన విజ‌యం భారతదేశాన్ని ప్రపంచ అంతరిక్ష రంగంలో మరింత ఉన్నత స్థాయికి తీసుకెళుతుంద‌ని ప్రశంసించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page