Friday, September 18, 2026
HomeHyderabadముగిసిన తెలంగాణ బాలోత్సవం స‌మ్మ‌ర్ క్యాంప్

ముగిసిన తెలంగాణ బాలోత్సవం స‌మ్మ‌ర్ క్యాంప్

హైద‌రాబాద్‌, మే 22, అద్దం న్యూస్ :   తెలంగాణ బాలోత్సవం ఆధ్వ‌ర్యంలో గ‌త 18 రోజుల పాటు సుంద‌ర‌య్య‌విజ్ఞాన‌కేంద్రంలో జ‌రుగుతున్న స‌మ్మ‌ర్ క్యాంప్ గురువారం ముగిసింది. ఈ సంద‌ర్భంగా సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ముగింపు కార్య‌క్ర‌మం సంద‌డిగా జ‌రిగంది. ఈ సంద‌ర్భంగా పిల్లల నేస్తం తెలుగు మాష్టారు అంకమ్మ మాట్లాడుతూ.. విలువల బడిగా – సృజనకు గుడిగా సమ్మర్ క్యాంపు 18 రోజులు విజ్ఞాన దాయకంగా దేశభక్తియుతంగా, సందేశాత్మక మైన పాటలతో తల్లిదండ్రులు మంత్రముగ్ధుల్ని చేసారన్నారు. ఆడపిల్లలు కన్నీళ్లు కాదు కన్నెర్ర చేయాలని, ఏడుపు కాదు ఎదురు తిరగడం స్కిట్, డ్యాన్స్ లు అలరించాయన్నారు. పేద పిల్లల పేగు బంధం బాలోత్సవం సమ్మర్ క్యాంప్ అని కోనియాడారు. తెలంగాణ బాలోత్సవం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. బాలలలో శాస్త్రీయ ఆలోచన సృజనాత్మకతను పెంచామన్నారు. సంస్కృతి కళలను నేర్పించి క్రీడలను ఇండోర్ గేమ్స్‌ను ప్రోత్సహించడం, శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్ కల్చర్ గ్రామీణ వాతావరణాన్ని చూయించి ప్రకృతి పట్ల సమగ్రమైన అవగాహనను కల్పించడం జరిగిందని తెలిపారు. దేశభక్తిని పెంపొందించి సమాజంలో వారి పాత్రలను తెలియజేశామని, శ్రమ పట్ల గౌరవం, సమిష్టి తత్వాన్ని సోదరత్వాన్ని ప్రేమ తత్వాన్ని పిల్లల్లో నేర్పించామని పేర్కొన్నారు. ఈ స‌మ్మ‌ర్ క్యాంప్‌లో కాచిగూడ, నారాయణగూడ, బాగ్‌లింగంప‌ల్లి, నల్లకుంట్ల, చిక్కడపల్లి, రాంనగర్, పాలమూరు బస్తీ, అంబ‌ర్‌పేట్‌, శంకర్ మఠం త‌దిత‌ర‌ ప్రాంత నిరుపేద పిల్లలు ఈ సమ్మర్ క్యాంపులో 85 మంది 18 రోజులపాటు పాల్గొన్నారన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బాలోత్సవం కార్యదర్శి ఎన్.సోమయ్య, తెలంగాణ బాలోత్సవం ఉపాధ్యక్షురాలు కె.సుజావతి, డ్యాన్స్ మాస్టర్ గోపాల్, పాటల మాస్టర్ వినయ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page