తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం
మాట తప్పడం, మడమ తిప్పడమే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్
– టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ విద్యా రంగంలో తీవ్ర సంక్షోభం ఉందని, మాట తప్పడం, మడమ తిప్పడమే రేవంత్ రెడ్డి ట్రేడ్ మార్క్ అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మితే ఉద్యోగులకు అన్యాయం తప్పదన్నారు.
ఉద్యోగుల పీఆర్సీ ఎక్స్ పైరీ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వారికి 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చాలని అడిగితే ఉద్యోగులు, ఉపాధ్యాయులను బెదిరిస్తున్నాడని, ఉద్యోగులంటే మీ బానిసలు కాదని గుర్తు పెట్టుకోండన్నారు. ప్రభుత్వ హైల్త్ కార్డు పనిచేస్తే మీరు ఏం చేయమంటే అది టీఆర్ఎస్ చేస్తుందని.. లేదంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా ? అని కవిత ప్రశ్నించారు. ఈ నెల 18 లోగా వారికిచ్చిన హామీలు నెరవేర్చాలని, లేదంటే హైదరాబాద్ దిగ్భంధానికి ఉద్యోగ సంఘాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుంరదయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన సదస్సులో కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం సమయంలో ఉపాధ్యాయులంతా కూడా ఉద్యోగం కన్నా కూడా ఉద్యమమే ముఖ్యమని పోరాటం చేశారని, కానీ రేవంత్ రెడ్డి సర్కార్ లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఏ ప్రభుత్వమైన ప్రజలకు మెరుగైన పారదర్శకమైన పాలన అందించాలంటే ఉద్యోగుల సహకారం అవసరమని… కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మాత్రం ప్రభుత్వ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ వారిని నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేరుతో గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ ఒక్క పథకం కూడా సరిగా అమలు కావటం లేదని, ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తుండటం కారణంగానే పరిపాలన సజావుగా సాగటం లేదన్నారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులను అభివృద్ధిలో డెవలపర్స్ గా చూస్తామని, ఉద్యోగులను సంతోష పెట్టేలా, వారిని గౌరవించేలా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. తెలంగాణ జాగృతి గత 20 ఏళ్లుగా ఏ కార్యక్రమం చేసిన సరే దాన్ని ముందుండి నడిపిందే ప్రభుత్వ ఉపాధ్యాయులేనని గర్వంగా చెబుతానని కవిత తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు అన్ని చేస్తామని మాటిచ్చారని.. కానీ ఇప్పుడు వారిని పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ ఉపాధ్యాయుడు గానీ.. ప్రభుత్వ ఉద్యోగి గానీ సంతోషంగా లేడన్నారు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా మాత్రమే పర్మినెంట్ ఉద్యోగులు ఉంటారని.. మరో 5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారని, రిటైర్ అయిన ఉద్యోగుల సంఖ్య ఒక 2 లక్షల వరకు ఉంటుందన్నారు. తెలంగాణలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య, వైద్యం అందాలనే ఉన్నత లక్ష్యాన్ని మా పార్టీ పెట్టుకుందని కవిత స్పష్టం చేశారు. కానీ ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. విద్యార్థులకు పేషీయల్ రికగ్నేషన్ అంటూ రిపోర్ట్ లు అంటూ టీచర్లు పాఠాలు చెప్పకుండా చేస్తున్నారని.. ఇక ఒకే టీచర్ ఉన్న స్కూళ్లలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. టీచర్లకు సినియారిటీని బట్టి ఇవ్వాల్సిన ప్రమోషన్లు కూడా ఇవ్వటం లేదని తెలిపారు. రాష్ట్రంలో లక్షా 20 వేల మంది టీచర్లే ఉంటారని.. కానీ వాళ్లతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాలేని.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మళ్లీ అధికారంలోకి రాదన్నారు. ప్రతి ఊళ్లో ఒక స్కూల్ ఉండాలి. ప్రతి తరగతికి ఒక టీచర్ ఉండాలని టీఆర్ఎస్ ఒక విధానం పెట్టుకుందన్నారు. మేము అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్యను పరిపుష్టం చేస్తాం, ప్రభుత్వ విద్యను కాపాడుతామని కవిత పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో పోలీసుల పరిస్థితి కూడా ఘోరంగా ఉందని.. వాళ్లకు రావాల్సిన అన్ని ప్రయోజనాలు పెండింగ్ లోనే ఉన్నాయన్నారు.
2003 లో రిక్రూట్ అయిన పోలీసులకు ఓపీఎస్ రాలేదని.. అదే విధంగా 2003 లో రిక్రూట్ అయినా టీచర్లకు కూడా ఓపీఎస్ ఇవ్వాలన్నారు. 2003 లో రిక్రూట్ అయిన టీచర్లకు ఓపీఎస్ ఇస్తే ప్రభుత్వానికే 2 వేల కోట్లు మిగులుతాయని.. కనీసం ఈ విషయం కూడా ముఖ్యమంత్రికి తెలియటం లేదని.. వారిని ఓపీఎస్ కు బదలాయించి వచ్చే 2 వేల కోట్లతో మిగతా బకాయిలు తీర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వంపై పోరాటం చేసే విషయంలో మాటిమాటికి ఆందోళనలను పోస్ట్ పోన్ చేసుకుంటున్నారన్నారు. మనం తల్లి కాంగ్రెస్ తో పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్న వాళ్లం.. ఈ పిల్ల కాంగ్రెస్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మనం ఏపీని చూసి ఉద్యమాలు నేర్చుకోలేదు.. కానీ జగన్ ప్రభుత్వంపై టీచర్లు పెద్ద ఎత్తున పోరాటం చేసి వాళ్ల డిమాండ్లు సాధించుకున్నారన్నారు. ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్న 37 అంశాల్లో చాలా వరకు డబ్బులకు సంబంధం లేనివే ఉన్నాయని, ముఖ్యంగా 317 జీవో బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గత ప్రభుత్వంలో వారికి న్యాయం చేసేందుకు నేను చేసిన ప్రయత్నం ఫలించలేదన్నారు. 317 బాధితుల్లో మహిళ ఉద్యోగులే ఎక్కువ ఉన్నారు. వాళ్లు బాధపడుతుంటే నాకు బాధవుతుందని, ఈ నెల 18 వరకు సమస్యలు పరిష్కరిస్తానని ముఖ్యమంత్రి చెప్పిండని… ఆ తర్వాత సమస్యలు పరిష్కరం కాకపోతే హైదరాబాద్ దిగ్భంధం కోసం ఉద్యోగ సంఘాలు పిలుపు ఇవ్వాలని సూచించారు. ఉద్యోగుల పీఆర్సీ ఎక్స్ పైరీ అయ్యే పరిస్థితి ఉంది.. తక్షణమే వారికి 51 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హెల్త్ కార్డు ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్ లో పనిచేస్తుందా అని ముఖ్యమంత్రికి ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నానని కవిత తెలిపారు.













Leave a Reply