Friday, September 18, 2026
HomeHyderabadఅందాల పోటీలతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తం – కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి...

అందాల పోటీలతో తెలంగాణ కీర్తి విశ్వవ్యాప్తం – కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్

అంబర్‌పేట్‌, మే 24, అద్దం న్యూస్ :   కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకంతో నిరుద్యోగుల జీవితాలలో వెలుగులు నింపుతుందని కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణ గౌడ్ అన్నారు. నగరంలో జరుగుతున్న అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రం విశ్వవ్యాప్తంగా కీర్తి పొందిందని, ఈ ఘనత సీఎం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు. శనివారం కాచిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అందాల పోటీలతో ప్రపంచం అంతా ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శం కాబోతుందన్నారు. గత ప్రభత్వం ప్రజలకు రేషన్ కార్డులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసిందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు జారీ చేయబోతుందని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగాల భర్తీతో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ధీమా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం క్రీడలను పూర్తిగా విస్మరించిందని, ప్రస్తుత ప్రభుత్వం క్రీడా యూనివర్సిటీతో పాటు అన్ని క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.

 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page