Friday, September 18, 2026
HomeHyderabad  పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు

  పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు

హైదరాబాద్, జూన్ 22, అద్దం న్యూస్ :    తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కార్యాలయంలో ఓఎస్‌డిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న పాకా రమేష్ కు ఉత్తమ ప్రజా సేవకుడు అవార్డు వరించింది. హైదరాబాద్ మాదాపూర్‌లో ఉన్న ఓ హోట‌ల్‌లో తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సారధి జి.వెన్నెల గద్దర్ చేతుల మీదుగా తెలంగాణ ఫిలిం ఛాంబర్ చైర్మన్ పి. రామకృష్ణ గౌడ్ చేతుల మీదుగా తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఓఎస్‌డి రమేష్ పాక కు ఉత్తమ ప్రజా అధికారి అవార్డుతో సత్కరించడం జరిగింది. తన వృత్తిని దైవంగా భావిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ విధులు నిర్వహిస్తున్న రమేష్ సేవలను వక్తలు కొనియాడారు. ఈ రోజు పాకా రమేష్ అందుకున్న బెస్ట్ హ్యూమనిటేరియన్ పబ్లిక్ సర్వెంట్ అవార్డు నిజమైన సేవ భావనతో, మరింత మందికి ఉపయోగపడే అవకాశాలను దేవుడు రమేష్ కి కల్పించాలని వ‌క్త‌లు ఆకాక్షించారు. అధికార నిబద్ధతతో పాటు మానవీయ విలువలకు ప్రాధాన్యతనిచ్చే ఆయన విధానం ప్రజాసేవలో స్ఫూర్తిదాయకమ‌న్నారు. ప్రజా ప్రయోజనానికి ఆయన అంకిత భావ సేవలకు గౌరవం దక్కిందన్నారు. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు, తెలంగాణ రెవెన్యూ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పాకా ర‌మేష్‌ను అభినందించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page