హైదరాబాద్, జులై 1, అద్దం న్యూస్ : వైద్యులంటేనే మానవత్వానికి ప్రతి రూపమని గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ అన్నారు జాతీయ వైద్యుల దినోత్సవ సందర్భంగా ప్రఖ్యాతిచెందిన వైద్య నిపుణుడు డాక్టర్.విజయ్ కుమార్, డాక్టర్.రంగారెడ్డి, డాక్టర్.వెంకటరమణ లకు కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఎంతో నైపుణ్యంతో ప్రతి రోజున వైద్యం, మానవత్వం పట్ల వైద్యులకు ఉన్న అంకిభావానికి అభినందనలు తెలియచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్, బీజేపీ నాయకులు ఆకుల సురేందర్, నర్సింహ, సాయి కుమార్, అరుణ్ కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, సంధ్యా రాణి, స్వప్న, సంయుక్త రాణి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
