Friday, September 18, 2026
HomeHyderabadగృహ హింస పై అవగాహన కార్యక్రమం

గృహ హింస పై అవగాహన కార్యక్రమం

గృహ హింస పై అవగాహన కార్యక్రమం

హైదరాబాద్, జులై 3, అద్దం న్యూస్ :    సీడీఇడబ్ల్యూ ( సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ ఉమెన్ ) అంబర్‌పేట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ వారి ఆధ్వర్యంలో వడ్డెర బస్తీ, నల్లకుంట పరిధిలో బస్తీ వాసులకు గృహ హింస పై మహిళలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, కౌన్సిలింగ్ సేవల గూర్చి సోమ‌వారం అవగాహన కల్పించారు. సీడీఇడబ్ల్యూ ( సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ అండ్ ఎంపవర్‌మెంట్ ఫర్ ఉమెన్ ) అంబ‌ర్‌పేట్ కౌన్సిల‌ర్ సుధారాణి అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన‌ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా అంబర్‌పేట్ మహిళా పోలీస్‌స్టేష‌న్ ఏఎస్ఐ అన్నపూర్ణ హాజ‌ర‌య్యారు. గృహ హింసతో స‌మ‌స్య‌లను ఎదుర్కొంటున్న మహిళలు ఫిర్యాదు చేయవచ్చని, సీడీడబ్ల్యూ కౌన్సిలింగ్, సహాయం అందిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి పోలీస్ కళా జాతర బృందం ( నల్లగొండ ) సాంస్కృతిక కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం కలుగచేశారు. ఈ కార్యక్రమంలో సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇటువంటి చైతన్యవంతమైన కార్యక్రమాలను తమకు ఏర్పాటు చేసినందుకు సీడీఇడబ్ల్యూ సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page