Friday, September 18, 2026
HomeAPవైస్ ఛాన్స‌ల‌ర్‌గా నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకుపెద్ద విఘాతం – టిడిపి సికింద్రాబాద్...

వైస్ ఛాన్స‌ల‌ర్‌గా నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకుపెద్ద విఘాతం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

వైస్ ఛాన్స‌ల‌ర్‌గా నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకు పెద్ద విఘాతం

– టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా



హైదరాబాద్, జులై 16, అద్దం న్యూస్ :   తెలుగుభాష పట్ల ఏమాత్రం అవగాహన లేని వ్యక్తిగా, నిన్నటి వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసిన తెలుగు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన నిత్యానంద రావు నియామకం తెలుగు భాషకు పెద్ద విఘాతమ‌ని, తెలుగు భాష అభివృద్ధికి పెద్ద అవరోధం అని సికింద్రాబాద్ పార్లమెంటు కన్వీనర్ సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… అంతరించిపోతున్న తెలుగుభాషా ఔన్నత్యాన్ని వారసత్వ కళలను, సాంస్కృతిక, సాహిత్య వైభవాలను పరిరక్షించాలనే ఉద్దేశంతో తన మానస పుత్రికగా తెలుగు విశ్వవిద్యాలయాన్ని 1983లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు తొలిసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే ఏర్పాటు చేసారన్నారు. ఆనాడు సోనాటి జోనప్ప, డాక్టర్ సి.నారాయణరెడ్డి, కోటేశ్వరరావు, వంటి మహామావులను వైస్ ఛాన్సులర్లుగా నియమిస్తే వారు కూడా ఆ విధంగానే పనిచేసి తెలుగు విశ్వవిద్యాలయానికి వన్నె తెచ్చారన్నారు. తెలుగును విశ్వవ్యాప్తం చేయడానికి దోహదపడ్డారన్నారు.

ప్రస్తుత ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చి సురవరం విశ్వవిద్యాలయంగా పేరు మార్చడం కొంత వరకు ఆమోదయోగ్యమే అని అన్నారు. సురవరం ప్రతాప్ రెడ్డి కూడా తెలంగాణ చరిత్రను తెలంగాణ ప్రజల మానసిక స్థితిగతులను, తెలుగు భాషకు ఎనలేని సేవ మహా మేధావి అని, ఆయన చేసిన సేవలు సదాస్మరణీయ‌మ‌న్నారు. తెలుగు భాష అభిమానులంతా హర్షించరు. “తొండ ముదిరి ఊసరవెల్లి అయిన” మాదిరిగా గత ప్రభుత్వాలు చేపట్టిన అభివృద్ది పనులకు పేరు మార్చడమే ప్రభుత్వాల లక్ష్యం కాకూడదన్నారు. తెలుగు సాహిత్య, సాంస్కృతిక వైభవాలను ఏమాత్రం దృష్టిలో పెట్టుకోకుండా పేరు మార్చడమే కాకుండా లోగోను కూడా మార్చడం దురదృష్టకరమ‌న్నారు.ఆనాడు ఎన్‌టిఆర్ ఎంతో మంది మేధావులతో చర్చించి అనేక అంశాలు పరిగణలోకి తీసుకుని రూపొందించిన లోగో పూర్ణకలశం, కొబ్బరికాయ, నాగుపాము మొదలైనది ఈ చిహ్నాం అని అన్నారు.

తెలుగుతనం ఉట్టి పడేలా తెలుగు జాతికి సంకేతంగా తయారుచేసిన ఈ లోగోను మార్చి తెలుగుదనమే లేకుండా మార్చడం ఎంతవరకు సమంజసం అని సాయిబాబా అన్నారు. ప్రస్తుత రోజుల్లో తెలుగు అంతంత మాత్రంగానే ఉందని, ఎన్‌టిఆర్ హయాంలో తెలుగు భాషకు అధికారభాష హోదా కల్పించారన్నారు. అటువంటి తెలుగుభాష గత బిఆర్ఎస్ కెసీఆర్ పాలనలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన “తెలుగుభాష” కు తెగులు పట్టింటే దౌర్భాగ్యమైన పరిస్థితి దాపురించిందని వాపోయారు. తనకు తోచిన విధంగా లోగోలను తయారు చేయడం ఏమాత్రం సరైందికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం పేర్లు మార్చడం తప్పితే వీళ్ళు ప్రజలకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. స్వర్గీయ ఎన్‌టిఆర్ మానస పుత్రికగా వెలుగొందిన తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిష్టను దిగజార్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం ఎన్‌టిఆర్‌ను రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలను అవమాన పర్చడమేనన్నారు. ప్రభుత్వం వెంటనే ఏకపక్ష నిర్ణయాలను మానుకొని పది మంది నిపుణులతో, నిష్ణాతులతో చర్చించి తెలుగు సాంస్కృతిక, సాంప్రదాయాలను గుర్తుకు తెచ్చేలా లోగోను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page