Friday, September 18, 2026
HomeCrime Newsచైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తి, అత‌ని భార్య‌ రిమాండ్‌

చైన్ స్నాచింగ్‌కు పాల్ప‌డిన వ్య‌క్తి, అత‌ని భార్య‌ రిమాండ్‌

హైదరాబాద్, న‌వంబ‌ర్ 8, అద్దం న్యూస్ :    వ్యాపారంలో నష్టాలు రావడంతో పాటు చిన్న కుమార్తె వివాహం కోసం చేసిన అప్పులు తీర్చడానికి దొంగతనం చేసి నష్టాలు పూడ్చుకోవాలని చైన్ స్నాచింగ్‌ చేసిన వ్య‌క్తితో పాటు అకౌంట్‌లో డ‌బ్బులు వేసుకున్న‌ అత‌ని భార్య‌ను చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. శనివారం సాయంత్రం చిక్కడపల్లి పోలీస్‌స్టేష‌న్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఐ శంకర్, ఇన్‌స్పెక్ట‌ర్‌ రాజు నాయక్‌ల‌తో కలిసి చిక్కడపల్లి స‌బ్ డివిజన్ ఏసీపీ ర‌మేష్‌కుమార్ వివరాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా వాస్తవ్యుడు గుడిపాటి బ్రహ్మయ్య ( 51 ), తన భార్య గుడిపాటి అంజలితో నగరంలోని బోరబండలో నివసిస్తున్నాడు. కాగా అతను చేస్తున్న వ్యాపారంలో నష్టం రావడంతో పాటు చిన్న కుమార్తె వివాహం కోసం అప్పులు చేశాడు. ఈ క్రమంలో చోరీ చేయాలని ఆలోచన చేశాడు. తొలుత బోరబండ, యూసుఫ్‌గూడ‌ ప్రాంతాల్లో చోరీకి యత్నించాడు. సఫలం కాకపోవడంతో గత నెల 31 న ఎర్రగడ్డ నుంచి నారాయణగూడకు మెట్రో రైలులో వచ్చాడు. అక్కడి నుంచి కోఠికి చేరుకుని రాంకోఠి బస్టాండ్‌లో ఆర్టీసీ బస్సు ఎక్కిన ఎ.సురేఖ ( 69 ) ను బస్సులో వెంబడించాడు. చిక్కడపల్లిలో బస్సు దిగిన సురేఖ వెనుకనే నడిచాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌ దేవి థియేటర్ వద్ద ఉన్న తన అపార్ట్‌మెంట్‌కు చేరుకుని లిఫ్ట్‌ కోసం వెయిట్ చేస్తున్న ఆమె మెడలో నుంచి రెండు తులాల గొలుసును బ్రహ్మయ్య బలవంతంగా లాగేసి పరారయ్యాడు. ఈ క్రమంలో సురేఖ మెడకు గాయం కూడా అయ్యింది. బ్రహ్మయ్య చోరీ చేసిన గొలుసును భార్యకు ఇచ్చి ఇద్దరూ కలిసి మణప్పురం సంస్థలో కుదువపెట్టి రూ.1.13 లక్షలు తీసుకుని అప్పులు తీర్చేశారు. చోరీ చేసి తెచ్చిన బంగారు చైన్‌ను భర్తతో కలిసి మణప్పురం సంస్థలో తనఖా పెట్టి లక్షకు పైగా డబ్బులు తన అకౌంట్‌లో వేయించుకున్నారు. బాధితురాలు సురేఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న క్రైమ్ పోలీసులు శనివారం మధ్యాహ్నం బ్రహ్మయ్య, అంజలిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4.6 గ్రాముల చైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 14.4 గ్రాములు తనఖా పెట్టిన బంగారు నగకు సంబంధించిన రశీదును స్వాధీనం చేసుకున్నారు. భార్యా, భ‌ర్త‌ను రిమాండ్‌కు త‌ర‌లించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page