Friday, September 18, 2026
HomeGadgetiPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 హవా: అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!

iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 హవా: అమ్మకాల్లో సరికొత్త రికార్డులు!

iPhone 16: భారత్‌లో ఐఫోన్ 16 హవా: అమ్మకాల్లో సరికొత్త రికార్డులు !

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ (Apple) తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 మొదటి 11 నెలల కాలంలోనే ఏకంగా 65 లక్షల ‘ఐఫోన్ 16’ (iPhone 16) యూనిట్లను విక్రయించి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్‌గా రికార్డులకెక్కినట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.

సాధారణంగా బడ్జెట్ ఫోన్లకు ప్రాధాన్యతనిచ్చే భారత మార్కెట్‌లో ప్రీమియం ఫోన్ల అమ్మకాలు పెరగడం వినియోగదారుల మారిన అభిరుచికి నిదర్శనం. అమ్మకాల్లో ఐఫోన్ 16 (iPhone) టాప్ ప్లేస్‌లో ఉండగా, ఐఫోన్ 15 కూడా టాప్ 5 జాబితాలో నిలవడం విశేషం. ‘మేడ్ ఇన్ ఇండియా’ (Made in India) వ్యూహంలో భాగంగా స్థానికంగా తయారీని పెంచడం, నో-కాస్ట్ ఈఎంఐ, బ్యాంక్ ఆఫర్ల వంటి సదుపాయాలు ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిపుణులు భావిస్తున్నారు.

2025 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ ఇండియా దేశీయంగా రికార్డు స్థాయిలో 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.75 వేల కోట్లు) విక్రయాలను నమోదు చేసింది. అలాగే నవంబర్ నెలలో 2 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను (iPhone) భారత్ నుంచి ఎగుమతి చేసింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే ప్రతి ఐదు ఐఫోన్లలో ఒకటి భారత్‌లోనే తయారవుతుండటం గమనార్హం. ఇటీవల బెంగళూరు, పూణె, నోయిడాలలో కొత్త స్టోర్లను ప్రారంభించడం కూడా యాపిల్ వృద్ధికి దోహదపడింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page