అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: తెలంగాణలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు (Entrance Tests) రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) శుభవార్త తెలిపింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షల (Common Entrance Tests) తేదీలను అధికారికంగా ప్రకటించింది. ఈఏపీసెట్ (EAPCET), ఐసెట్, ఈసెట్ సహా పలు కీలక పరీక్షలు మే నెలలోనే జరగనున్నాయి.
ముఖ్యమైన పరీక్షల తేదీలు:
* టీజీ ఈఏపీసెట్ (EAPCET): అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 4, 5 తేదీల్లో; ఇంజినీరింగ్ విభాగానికి మే 9 నుంచి 11 వరకు పరీక్షలు జరుగుతాయి.
* టీజీ ఎడ్‌సెట్ (EdCET): మే 12న.
* టీజీ ఐసెట్ (ICET): ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం మే 13, 14 తేదీల్లో.
* టీజీ ఈసెట్ (ECET): పాలిటెక్నిక్ విద్యార్థులకు మే 15న.
* టీజీ లాసెట్ & పీజీఎల్‌సెట్: మే 18న.
* టీజీ పీజీ ఈసెట్ (PGECET): మే 28 నుంచి 31 వరకు.
* టీజీ పీఈసెట్ (PECET): మే 31 నుంచి జూన్ 3 వరకు (ఫిజికల్ టెస్టులు).
అన్ని పరీక్షలను (Entrance Tests) కంప్యూటర్ ఆధారిత విధానంలో (CBT) నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్ జరగనుంది. పూర్తి నోటిఫికేషన్లు, దరఖాస్తు తేదీలు, సిలబస్ వివరాలను త్వరలోనే సంబంధిత సెట్ కన్వీనర్లు విడుదల చేస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులు ఇప్పటి నుంచే తమ ప్రిపరేషన్‌ను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png