Friday, September 18, 2026
HomeGREATER HYDERABADపేదొళ్ల‌ను రోడ్డున ప‌డేసిన‌ జ‌న‌గామ క‌లెక్ట‌ర్

పేదొళ్ల‌ను రోడ్డున ప‌డేసిన‌ జ‌న‌గామ క‌లెక్ట‌ర్

పేదొళ్ల‌ను రోడ్డున ప‌డేసిన‌ జ‌న‌గామ క‌లెక్ట‌ర్
జనగామ కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉన్న‌ టీ స్టాల్, మిల్క్ సెంటర్ల తొల‌గింపు

జ‌న‌గామ‌, మార్చి 11, అద్దం న్యూస్ :     జనగామ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ముందు ప్రభుత్వ సహాయంతో ఏర్పాటు చేసిన‌ టీ స్టాల్, మిల్క్ సెంటర్ల తొల‌గింపు ప్ర‌క్రియ‌తో క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా అబాసుపాల‌య్యారు. జేసీబీలు, బుల్ డోజర్‌ల‌ను తెప్పించి 20 మంది మున్సిపల్ సిబ్బంది, ఐదుగురు రెవెన్యూ సిబ్బందితో టీ స్టాల్లు, మిల్క్ సెంటర్లను బుధ‌వారం తొల‌గించారు. వివ‌రాల్లోకి వెళ్లితే…. జ‌న‌గామ మండ‌లంలోని ఎర్రగొళ్లపహాడ్ గ్రామానికి చెందిన కళ్యాణి, చీటకోడూరు గ్రామానికి చెందిన చిన్న మంజుల, పొత్కనూరి విజయలక్ష్మి ల‌కు గతంలో జ‌న‌గామ కలెక్టర్‌గా ఉన్న‌ రిజ్వాన్ భాషా షేక్ డ్వాక్రా గ్రూపు ద్వారా చెరో మూడు ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున లోన్లు ఇప్పించి టీ స్టాల్‌, మిల్క్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయించారు. జీవ‌నం సాగిస్తూ లోన్ చెల్లిస్తున్న‌పేద వారి పై ప్ర‌స్తుత క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా క‌న్నుప‌డింది. పేద కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశారు. మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులను పురమాయించి ఈ మిల్క్ సెంటర్లు, టీ స్టాల్‌లను తొలగించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాలు చేశారు. దీంతో సంబంధిత అధికారులు ఆ టీ స్టాల్, మిల్క్ సెంటర్లను తొల‌గించారు. స్థానిక సీపిఎం నాయ‌కులు వ‌చ్చి బాధితుల‌కు అండ‌గా ఆందోళ‌న చేసినా అధికారులు మాత్రం ఆ టీ స్టాల్, మిల్క్ సెంటర్లను తొల‌గించడం వ‌ల్ల జిల్లా క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. త‌మ‌కు గ‌త క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ డ్వాక్రా ద్వారా లోన్లు ఇప్పించార‌ని…ఇప్పుడు వ‌చ్చిన ఈ క‌లెక్ట‌ర్ త‌మ‌కు ఉన్న ఉపాధిని తీసేస్తే ఆ లోన్ల‌ను ఎలా చెల్లించాల‌ని బాధితులు వాపోతున్నారు.

గతంలోనూ వివాదాల్లో సందీప్ కుమార్ ఝా :

సందీప్ కుమార్ ఝా గ‌తంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా ఉన్న స‌మ‌యంలో వ్యవహరించిన‌ వైఖరి తీవ్ర వివాదానికి దారి తీసింది. మానేరులో ఇల్లు కొల్పోయిన నిర్వాసితుడికి నష్టపరిహారం చెల్లిచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఆదేశాలను కలెక్టర్‌గా ఉన్న సందీప్ కుమార్ ఝా ఆ ఆదేశాల‌ను తుంగలోకి తొక్కడంతో.. ధర్మాసనం వారెంట్ ఇష్యూ జారీ చేసింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page