Friday, September 18, 2026
HomeHyderabadప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు...

ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుంది – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

 

హైదరాబాద్, ఏప్రిల్ 23, అద్దం న్యూస్ :    ప్రభుత్వ నిర్లక్ష్యంతో తెలుగుజాతి ప్రతిష్ట అబాసు పాలవుతుందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా అన్నారు. న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో ఆయ‌న మాట్లాడుతూ… ఎన్టీఆర్ తెలుగు బాష కోసం చేసిన కృషి చేసారని, “తెలుగు వెలుగుల కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం” “తెలుగు విశ్వవిధ్యాలయం”, “తెలుగు లలిత కళాతోరణం”, “ఎన్టీఆర్ ఘాటు” వాటిని పునరుద్దించాలని మార్చి నెల 27వ తేదీన ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని క‌లిసి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. ఆ రోజు సానుకూలంగా స్పందించిన ఆయన ఈనాటి వరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదని విమ‌ర్శించారు. ఇదే విషయమై మరోసారి వేం నరేందర్ రెడ్డి వినతి పత్రం సమర్పించాలని ప్రయత్నించామ‌ని, కానీ ఆయ‌న అపాయింట్‌మెంట్ దొర‌క‌డంలేద‌న్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్వర్గీయ ఎన్టీ రామారావు ఆనాటి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలుగు జాతికి, తెలుగు భాషకు, సాహిత్యానికి, తెలుగు పౌరుషానికి ప్రతీకగా తెలుగువారి కీర్తి ప్రతిష్టలు చిరస్మరణీయంగా నిలిచిపోవాలని సదుద్దేశంతో ట్యాంక్ బండ్‌పై నెలకొల్పిన తెలుగు వెలుగుల కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం ఈరోజు శిథిలావస్థకు చేరుకుంద‌న్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు ట్యాంకుబండ్‌ పైన విగ్రహాలకు మరమ్మతులు, నిర్వహణ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ విషయంలో ఆసక్తి కనబరచి తెలుగు వెలుగుల కళామూర్తుల విగ్రహాలకు మరమ్మతులు, పరిసరాలను శుభ్ర పరిచి, విగ్రహాలకు మెరుగులు దిద్ది తెలుగుజాతి ఖ్యాతిని కాపాడాలని మరోసారి వేం నరేంధర్ రెడ్డి వినతి పత్రం సమర్పించనున్నామ‌ని సాయిబాబా తెలిపారు. మే 28వ తేదీన ఎన్‌టిఆర్ జయంతి సందర్బంగా ఎన్టీఆర్ ఘాటును మరమ్మత్తులు చేపట్టి, సర్వాంగ సుందరంగా అలంకరించగలరని కోరారు. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎతున ధర్నా చేపడతామని హెచ్చ‌రించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్, బి.రాజు, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments

You cannot copy content of this page