శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులుగా నియమితులైన శ్రీపతి సతీష్‌కు ఘనంగా సన్మానం

హైదరాబాద్, అక్టోబర్ 13, అద్దం న్యూస్ : శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయ కమిటీ సభ్యులుగా తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర బీసీ కమిటీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ ను ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు నియమించారు. ఈ మేరకు శ్రీపతి సతీష్‌కు హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి నగర కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సోమవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా, నాయకులు పలుస బాల్‌రాజ్‌గౌడ్, ఎస్.ప్రకాష్, ఓ.వెంకటేష్ చౌదరి, శుక్రవేది, యాదగిరి తదితరులు శ్రీపతి సతీష్‌కు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply