ఘనంగా ఆర్.కృష్ణయ్య జన్మదిన వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 13, ( అద్దం న్యూస్ ) : బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అభిమానులు, బీసీ సంఘాల నేతలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ రాజేందర్ ఆధ్వర్యంలో ఆర్.కృష్ణయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి ర్యాగ అరుణ్‌తో పాటు బీసీ సంఘాల నేతలు, యువజన సంఘాల నాయకులు, అభిమానులు పాల్గొని కృష్ణయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.![]()

![]()













Leave a Reply