Sunday, October 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADసంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ సంచార ముస్లీం తెగ‌ల జేఏసీ...

సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి – తెలంగాణ సంచార ముస్లీం తెగ‌ల జేఏసీ చైర్మన్ సైదా ఖాన్‌

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, అక్టోబర్ 4, ( అద్దం న్యూస్ ) :    సంచార ముస్లింలకు ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ సంచార ముస్లీం తెగ‌ల జేఏసీ చైర్మన్‌ సైదా ఖాన్ ప్ర‌భుత్వాన్ని కోరారు. తెలంగాణ సంచార ముస్లిం బిసి ఈ 14, తెగ‌ల సంఘాల ఏకీక‌ర‌ణ కార్య‌క్ర‌మం ఆదివారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సంచార ముస్లీం తెగ‌ల జేఏసీ చైర్మన్‌ సైదా ఖాన్ మాట్లాడుతూ… రాజకీయ పార్టీలు ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. సంచార ముస్లింల కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. విద్యకు దూరమైన వారికి విద్య, నిరుద్యోగులకు ఉపాధి, ఇళ్లు లేనివారికి గృహాలు కల్పించాలని కోరారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌లు అందించాలని అన్నారు.

సంచార ముస్లింలలోని వివిధ కుల సంఘాలు, సంస్థలను ఏకం చేసి సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం జేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తుర్కకాశా, ఫకీరు, గారెడి సాయిబులు, గంటా ఫకీరు తదితర కులాలకు చెందిన ప్రతినిధులతో పాటు సంచార జాతులకు చెందిన రెండు సంస్థలు జేఏసీలో భాగస్వాములయ్యాయని చెప్పారు. జేఏసీ చైర్మన్‌గా సైదా ఖాన్, వైస్‌ చైర్మన్‌గా ఫరీద్‌, ప్రధాన కార్యదర్శిగా మసూద్‌, కోశాధికారిగా ఇమాం పాషా, గౌరవ సలహాదారుగా సలీమ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఇతర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page