ఈ నెల 20వ తేదీన ఆరె క‌టిక‌ల ఆత్మీయ స‌న్మాన స‌భ‌

ఈ నెల 20వ తేదీన ఆరె క‌టిక‌ల ఆత్మీయ స‌న్మాన స‌భ‌


హైదరాబాద్, జ‌న‌వ‌రి 18, అద్దం న్యూస్ :   ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో ఈ నెల 20వ తేదీన  ” ఆరె కటికల ఆత్మీయ సన్మాన సభ ” ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు సంఘం వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షుడు గజ్బిన్కర్ భూంపల్లి అశోక్ దాదా తెలిపారు. ఈ మేర‌కు స‌భ‌కు రావాల్సిందిగా బిసి క‌మిష‌న్ ఛైర్మ‌న్ నిరంజ‌న్‌ను, ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను, మాజీ ఎమ్మెల్సి, ప్రొఫెస‌ర్‌, తెలంగాణ జ‌న సమితి అధ్య‌క్షుడు కోదండ‌రామ్‌ను, రాజ్య‌స‌భ స‌భ్యుడు ఆర్‌.క్రిష్ణ‌య్య‌ను, సిపిఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి జాన్‌వెస్లీ త‌దిత‌రుల‌ను అశోక్‌దాదా క‌లిసి ఆహ్వాన‌ప‌త్రాల‌ను అంద‌చేశారు. ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఆరె క‌టిక‌ల ఆత్మీయ స‌న్మాన స‌భ‌కు హాజ‌రై విజ‌య‌వంతం చేయాల‌ని అశోక్ దాదా కోరారు. ఆహ్వాన పత్రిక‌ల‌ను అంద‌చేసిన వారిలో ఆరె క‌టిక అభివృద్ధి సంఘం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నందీశ్వ‌ర్‌, కోశాధికారి కేడి.దినేష్‌, ఉపాధ్య‌క్షులు మ‌ల్ల‌కేడి నాగ‌శేషు, పాలెం ర‌మేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రి జ‌మాల్‌పూర్ శ్రీనివాస్ త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page