సినీ దర్శకుడు బి.భాస్కర్ రావు జయంతి సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాతంగి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ
హైదరాబాద్, ఆగస్టు 29, ( అద్దం న్యూస్ ) : సినీ దర్శకుడు బి.భాస్కర్ రావు జయంతిని పురస్కరించుకుని ముషీరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాతంగి రాజేశ్వర్ ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం శనివారం జరిగింది. ముషీరాబాద్‌లోని రెయిన్‌బో హోంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి అతినగరం సుదేష్ నేత తో పాటు సినీ దర్శకుడు భాస్కర్‌రావు కుటుంబ సభ్యులు భావన, శ్రీకాంత్, దిలీప్ కుమార్, గాయత్రిదేవి, చైతన్య, సిద్ధార్థ్, మల్లి, రాజేష్, స్వప్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాతంగి రాజేశ్వర్ మాట్లాడుతూ… భారతంలో శంఖారావం, గృహలక్ష్మీ, ఆస్తులు అంతస్తులు, శ్రీవారు, మామా కోడలు, చదరంగం, చల్ మోహన రంగా, సక్కనోడు, శ్రీరామచంద్రుడు, రాధా మై డార్లింగ్ తదితర చిత్రాలను రూపొందించారన్నారు. మనుషులు మట్టి బొమ్మలు సినిమా ద్వారా ఉత్తమ కథారచయితగా నంది అవార్డును అందుకున్నారన్నారు. కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, మోహన్ బాబు తదితర అగ్ర నటులతో సినిమాలతకు దర్శకత్వం వహించారన్నారు.













Leave a Reply