పోటీ పరీక్షలకు ప్రిపేరై ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన
అభిషేక్ కుమార్‌కు సన్మానం
హైదరాబాద్, మే 16, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థలోని శాఖ గ్రంథాలయం గన్‌ఫౌండ్రిలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయిన అభిషేక్ కుమార్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఈ సందర్భంగా హైదరాబాదు నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, కార్యదర్శి పొట్లూరి పద్మజ తదితరులు అభిషేక్ కుమార్‌కు శాలువాలు కప్పి, జ్ఞాపికను అందచేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి గ్రంథా పాలకుడు సూర్య ప్రకాష్, మహేందర్, వెంకటేష్ యాదవ్, వెంకటేశ్వర్ రెడ్డి, రామ్మోహన్, మహేష్, యాదమ్మ తదితర ఉద్యోగస్తులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply