జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి
– ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలను కలిసిన టీడబ్ల్యూజేఎఫ్ నేతలు

న్యూఢిల్లీ, జూలై 28, ( అద్దం న్యూస్ ) :   కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్కలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర నాయకులు పలువురు కేంద్ర మంత్రులను, పార్లమెంటు సభ్యులను కలిసి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్ తదితరులు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులు మల్లు రవి, బిఆర్ఎస్ పార్టీకి చెందిన వద్దిరాజు రవిచంద్ర తదితరులకు వినతి పత్రాలు అందజేశారు. దేశ వ్యాప్తంగా జర్నలిస్టులకు ఉన్న రైల్వే రాయితీ పాస్‌లను గత కోవిడ్ సందర్భంగా రద్దు చేశారని, ఈ సదుపాయాన్ని పునరుద్దరించాలని వారు కోరారు.

దేశ వ్యాప్తంగా రిటైర్డ్ జర్నలిస్టులకు పెన్షన్ సదుపాయం కల్పిస్తూ జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలని, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేయాలని వారు కోరారు. జర్నలిస్టులకు, సొసైటీలకు ప్రభుత్వ స్థలాలు కేటాయించే విషయం పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పునః సమీక్షించి జర్నలిస్టులకు ఇళ్ళస్థలాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన ఆయా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, సమ్మయ్య గౌడ్, కె.రమాదేవి, పద్మనాభరావు, నాయకులు గోపాల్, మోయిజ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page