Sunday, October 18, 2026
No menu items!
HomeCrime Newsప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వస్తువులు ద్వంసం..

ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వస్తువులు ద్వంసం..

📰 Generate e-Paper Clip

కాచిగూడ‌, అక్టోబర్ 5, ( అద్దం న్యూస్ ) :   

క్రాకర్స్ కాల్చడంతో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ధర్మకోల్ వస్తువులు ధ్వంస‌మైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కాచిగూడ ఇన్‌స్పెక్ట‌ర్‌ ఎస్.రాజశేఖర్ తెలిపిన ప్రకారం వివ‌రాలిలా ఉన్నాయి. చెప్ప‌ల్ బ‌జార్ ర‌హ‌మ‌త్‌బాగ్‌లోని రహమత్ గార్డెన్ వెనుక ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న యువకులు క్రాకర్స్ కాల్చి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో వేశారు. దీంతో ఒక్కసారిగా మంటలు రావడంతో ధర్మకోల్ కాలి బుడిదై, దట్టమైన పొగ రావడంతో స్థానికులు కాచిగూడ పీఎస్‌కు సమాచారం ఇవ్వడంతో కాచిగూడ పోలీసులు, పైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న కాచిగూడ మాజీ కార్పొరేటర్ ఉమ యాదవ్ పరిస్థితిని పరిశీలించారు. కాచిగూడ ఆడ్మిన్ ఎస్సై పవన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ప్రాణా, ఆస్తి నష్టం జరగకపోవడంతో కాచిగూడ పోలీసులు ఊపిరి పిల్చుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page