హ‌త్య కేసులో నిందితుడి అరెస్ట్‌ – రిమాండ్‌కు త‌ర‌లించిన ముషీరాబాద్ పోలీసులు

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :  ఇచ్చిన‌ అప్పు తీర్చాల‌ని వేధిస్తున్నాడ‌ని అప్పు ఇచ్చిన వ్య‌క్తిని దారుణంగా హ‌త్య చేసిన కేసులో నిందితుడిని ముషీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. శ‌నివారం నిందితుడిని రిమాండ్‌కు త‌ర‌లించారు. సంచ‌ల‌నం సృష్టించిన ఈ కేసు వివ‌రాల‌ను ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాంబాబు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… అల్వాల్‌కు చెందిన సత్నం సింగ్ (59) ఈనెల 4వ‌ తేదీన ఉదయం ముషీరాబాద్ దేవి చౌక్ వద్ద ఉండే సోదరుని ఇంటికి వచ్చాడు. అనంతరం ఇంటికి వెళ్తాను అని చెప్పి వెళ్లిన అతను రాత్రి వరకు రాకపోవడం, సెల్ స్విచ్ ఆఫ్ ఉండడంతో కుటుంబ సభ్యులు అల్వాల్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్‌లో మిస్సింగ్ కావడంతో ఇక్కడ జీరో ఎఫ్ఐఆర్ చేసి దర్యాప్తును కొనసాగించారు. ఈ క్రమంలో 5వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో సీసీ ఫుటేజీలను పరిశీలించగా అతను గాంధీనగర్ పోలీస్‌స్టేష‌న్ పరిధిలోని బోయిగూడకు చెందిన నయన్ చంద్ర నాయక్ ఇంట్లోకి వెళ్లినట్లు తెలిసింది. ఇంట్లో నుండి ఒక వ్యక్తి మాత్రం బయటికి వచ్చినట్లు గమనించిన పోలీసులు తాళం పగలగొట్టి ఇంట్లో పరిశీలించడంతో పాటు ఇంటి ముందున్న సంపుని మూత తీసి చూడడంతో సత్నం సింగ్ మృతి చెంది కనిపించాడు. తలపై కొట్టి హత్య చేసి నీటి సంపులో వేసి వెళ్లినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తొలుత మిస్సింగ్ కేసుగా న‌మోదు చేసుకున్న పోలీసులు హ‌త్య కేసుగా న‌మోదే చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తును ప్రారంభించారు. నయన్ చంద్ర నాయకే స‌త్నం సింగ్‌ను హ‌త్య చేసి నీటి సంపులో ప‌డేసి పారిపోయిన‌ట్లు పోలీసులు ధృవీక‌రించారు. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్ప‌వ‌ల్లి నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తప్పిపోయిన వ్యక్తిని చంపిన తర్వాత నిందితుడు నయన్ చంద్ర నాయక్ గోవాకు వెళ్లిపోయాడని ముషీరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి విశ్వసనీయ సమాచారం అందింది. వెంటనే ప్రత్యేక బృందం గోవాకు బయలుదేరింది. త‌న‌ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం గోవాకు చేరుకున్నట్లు నిందితుడికి తెలిసింది. దీంతో నిందితుడు హైదరాబాద్‌కు తిరిగి వచ్చాడు. నిందితుడు ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉండగా, ముషీరాబాద్ పోలీసులు ప్రత్యేక బృందంతో కలిసి నిందితుడిని పట్టుకున్నారు. విచార‌ణ‌లో నిందితుడు నయన్ చంద్ర నాయక్, మృతుడు సత్నం సింగ్ స్నేహితులు అని తెలిసింది. నిందితుడు నయన్ చంద్ర నాయక్ డ‌బ్బు అవ‌స‌రం ఉండి స‌త్నంసింగ్‌ను అడుగ‌గా బంగారు గొలుసు ఇచ్చాడు. అవ‌స‌రం నిమిత్తం తీసుకున్న బంగారు గొలుసును తిరిగి ఇవ్వాల‌ని స‌త్నం సింగ్ నిందితుడు చంద్ర నాయ‌క్‌ను అడుగుతున్నాడు.

ఈ నేప‌ధ్యంలో స‌త్నంసింగ్‌ను అంత‌మొందిస్తే అప్పుగా తీసుకున్న బంగారు గొలుసు ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌ని బావించిన నిందితుడు చంద్ర‌నాయ‌క్ ఈ నెల 4వ తేదీన త‌న ఇంటికి ర‌మ్మ‌న్నాడు. ముందే వేసుకున్న ప్లాన్‌లో భాగంగా స‌త్నంసింగ్ రాగానే అతడి నుదిటిపై విచ‌క్ష‌ణ‌రహితంగా కొట్టి గొంతుపై క‌త్తితో పొడిచాడు. స‌త్నంసింగ్ మ‌ర‌ణించాడు అని నిర్ధారించిన త‌ర్వాత మృత‌దేహాన్ని వంట గ‌దిలో ఉన్న మంచినీటి సంపులో ప‌డేవేసాడు. అంత‌టితో ఆగ‌కుండా మృతుడి మెడ‌లో ఉన్న బంగారు గొలుసును కూడా తీసుకొని గోవాకు వెళ్లిపోయాడు. సత్నాం సింగ్ నుండి తీసుకున్న హ్యాండ్‌లోన్‌ను తిరిగి చెల్లించకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో హ‌త్య చేసిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఎట్ట‌కేల‌కు పోలీసులు చంద్ర‌నాయ‌క్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు. సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శిల్పవల్లి, చిక్కడపల్లి డివిజన్ ఏసిపి ఎల్.రమేష్ కుమార్ ల‌ పర్యవేక్షణలో ముషీరాబాద్ పోలీస్ స్టేషన్, డీసీపీ సెంట్రల్ జోన్, క్రైమ్ టీం ఏర్పాటు చేసిన పోలీస్ ఇన్‌స్పెక్టర్ జి. రాంబాబు బృందం నిందితుడిని అరెస్టు చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page